7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 18 నెలల డీఏ బకాయిలు అకౌంట్ లోకి
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం.. ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే దీనిపై కేబినేట్ భేటీ కానుంది. ఇందులో 18 నెలల డీఏ బకాయిలపై చర్చించనున్నారు. గత సెప్టెంబర్ లో డీఏ, డీఆర్ ను పెంచిన విషయం తెలిసిందే కదా. అయితే.. 18 నెలల డీఏ బకాయిలు మాత్రం చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి.
జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.వాటిని దసరా, దీపావళి కానుకగా ముందే చెల్లిస్తారని భావించినా వాటిని చెల్లించలేదు. తాజాగా బకాయిలపై నిర్ణయం తీసుకొని త్వరలోనే వాటిని చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేవల్ 3 ఉద్యోగుల డీఏ బకాయిలను రూ.11,880 నుంచి రూ.37,554 వరకు చెల్లించే అవకాశం ఉంది. అదే లేవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,15,900 వరకు చెల్లించే అవకాశం ఉంది.
7th Pay Commission : 38 శాతానికి పెరిగిన డీఏ
28 సెప్టెంబర్ 2022న యూనియన్ కేబినేట్ డీఏను 38 శాతానికి పెంచింది. ఇదివరకు 34 శాతం ఉండగా.. 4 శాతం పెంచి 38 శాతానికి పెంచింది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏను పెంచారు. జులై 1, 2022 నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ, డీఆర్ అందుబాటులోకి రానుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. సంవత్సరానికి రూ.6261.20 కోట్లు డీఆర్, రూ.4174.12 కోట్లు 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంటే జులై 2022 నుంచి ఫిబ్రవరి 2023 కి కేంద్రంపై పడే భారం అది.