Breaking : బ్రేకింగ్.. అహ్మదాబాద్ పేలుళ్ళ కేసు, 38 మందికి మరణ శిక్ష…!
Breaking : అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది ప్రత్యేక కోర్ట్. 2008 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తీర్పుపై దేశం మొత్తం ఆసక్తిగా చూసింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న 49 మందిలో 38 మందికి గుజరాత్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించారు.
జూలై 26, 2008న, అహ్మదాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 వందల మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాంద్-అల్-ఇస్లామీ ఈ దాడికి బాధ్యత వహించింది. 70 నిమిషాల వ్యవధిలో నగరంలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి.
కొన్ని బాంబులను అధికారులు నిర్వీర్యం చేసారు. మొత్తం నగరం లో 18 చోట్ల బాంబులు అమర్చారు. రద్దీ గా ఉండే ప్రాంతాల్లో ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాద సంస్థలు బాంబులు అమర్చాయి.