Medical Student : గ్రామానికి సేవ చేయాలన్న యువకుడి కల.. మరొక హృదయ విదారకమైన కథ వెలుగులోకి..!
ప్రధానాంశాలు:
Medical Student : గ్రామానికి సేవ చేయాలన్న యువకుడి కల.. మరొక హృదయ విదారకమైన కథ వెలుగులోకి..!
గ్రామానికి సేవ చేయాలన్న యువకుడి కల.. విమాన ప్రమాదం తుడిచేసింది
Medical Student : జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ దుర్ఘటనలో 265 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో మరొక హృదయ విదారకమైన కథ వెలుగు చూసింది. రాజస్థాన్లోని బార్మెర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు జైప్రకాష్, డాక్టర్ కావాలన్న ఆశతో అహ్మదాబాద్‌కి వెళ్లాడు. అయితే విమానం నేరుగా మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలడంతో అతడు అక్కడికే మరణించాడు.

Medical Student : గ్రామానికి సేవ చేయాలన్న యువకుడి కల.. మరొక హృదయ విదారకమైన కథ వెలుగులోకి..!
Medical Student : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మరొక హృదయ
విదారకమైన కథ వెలుగులోకి
జైప్రకాష్ చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలన్న ఆశతో చదువులో కష్టపడి నీట్‌లో 675 మార్కులు సాధించి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. అప్పటి నుండి అతని తండ్రి ధర్మారామ్ ఆకాంక్ష కూడా అదే. తన కొడుకు డాక్టర్ కావాలి. బలోత్రాలోని ఒక హస్తకళల కర్మాగారంలో మేనేజర్‌గా పనిచేసే ఆయన, అప్పు చేసి కొడుకు చదువుల కోసం ఖర్చు పెట్టాడు. జైప్రకాష్ కూడా రెండవ సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతూ డాక్టర్ అయి తన గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. కానీ ఈ విమాన ప్రమాదం ఆ కలలన్నిటికీ తెర వేసింది.
జైప్రకాష్ మృతదేహాన్ని స్వగ్రామమైన బోర్ చరణ్‌కు తీసుకురాగానే గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. జిల్లా కలెక్టర్ టీనా దాబీతో పాటు గ్రామస్థులంతా జైప్రకాష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. అతడి ఆకస్మిక మరణం ఏకంగా ఒక తరం ఆశలను మింగేసింది. గ్రామం కోసం సేవ చేయాలన్న యువకుడి కల అర్థాంతరంగా ముగియడం అందరికీ మిక్కిలి బాధను కలిగించింది. ఈ విషాద ఘటన దేశాన్ని కదిలించిన ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు.