Today Gold Rates : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం రేట్లు.. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
Today Gold Rates : దేశంలో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతుండడం కనిపించింది. ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత దేశంలో బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. తాజాగా మంగలవారం నాడు బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి, రూ.47, 610 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51, 900గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,240 గా కొనసాగుతోంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 450 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49, 590గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44, 450 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది. ఒమిక్రాన్ భయాందోళనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం స్థిరంగా కొనసాగుతున్నాయని అంటున్నారు.