Today Gold Rates : మహిళలకు శుభవార్త.. భారీ తగ్గిన బంగారం , వెండి ధరలు..!
ప్రధానాంశాలు:
Today Gold Rates : మహిళలకు శుభవార్త.. భారీ తగ్గిన బంగారం , వెండి ధరలు..!
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కొనుగోలుదారులకు ఇది బంపర్ గుడ్ న్యూస్ అనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా వరుసగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారం కొనాలనుకున్న వారికి ఈ తగ్గుదల ఊరట కలిగిస్తోంది.ఈ రోజు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.900 తగ్గి రూ.1,01,400కు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,950గా ఉంది. గత కొన్ని రోజులుగా వరుసగా ధరలు పెరుగుతున్న తరుణంలో ఇది గణనీయమైన తగ్గుదలగా పరిగణించబడుతోంది.

Today Gold Rates : మహిళలకు శుభవార్త.. భారీ తగ్గిన బంగారం , వెండి ధరలు..!
Today Gold Rates భారీగా తగ్గుదల..
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి రూ.1,03,000 స్థాయి నుంచి రూ.1,02,100కు పడిపోయింది. శుక్రవారం వరకు ఐదు సెషన్లలో బంగారం ధరలు ఏకంగా రూ.5,800 వరకు పెరిగిన విషయం గమనించదగినది. వెండి విషయానికొస్తే – ఇది కూడా నేటి మార్కెట్లో భారీ తగ్గుదలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.2,000 వరకు తగ్గి రూ.1,15,000 వద్ద నమోదైంది. అయితే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.1,25,000 వద్ద కొనసాగుతోంది.
ధరల తగ్గుదలకు ప్రధానంగా కొన్ని అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణామాలు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్‌డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ ప్రకారం
మార్కెట్లో సానుకూల వాతావరణం, సురక్షిత పెట్టుబడి సాధనాలపై డిమాండ్ తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల శాంతింపు.. ఇవన్నీ బంగారం ధరలు పడిపోవడానికి దోహదపడ్డాయి. బంగారం 24క్యారెట్లు (10గ్రా) ₹1,01,400 కాగా, 22 క్యారెట్లు (10గ్రా) ₹92,950గా నమోదైంది. వెండి 1 కిలో ₹1,15,000 (హైదరాబాద్), ₹1,25,000 (చెన్నై, కేరళ)గా ట్రేడ్ అయింది.