Today Covid Update : దేశంలో కరోనా ప్రళయం.. ఒక్కరోజే 2,82,970 కొవిడ్ కేసులు..441 మరణాలు.!
Today Covid Update : దేశంలో నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు నేడు మళ్ళీ పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే నేడు కేసులు భారీగా నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 82 వేల 970 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మహమ్మరితో తాజాగా 441 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 94.09% కాగా.. మరణాల రేటు 1.29%గా ఉంది.కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు 15. 13% శాతానికి పెరిగింది.
దేశంలో ప్రస్తుతం 18, 31, 000 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8, 961కు చేరుకుంది. తాజాగా 1, 88, 157 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

Karthika Deepam Serial ToDay Episode What is going to happen
ఏది ఏమైనప్పటికీ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరిస్తున్నాయి.