Today Corona Updates : గుడ్‌న్యూస్ భారత్ లో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
Today Corona Updates : దేశంలో చాప కింద నీరులా వేగంగా ప్రవహిస్తూ వస్తున్న కరోనా మహమ్మారికి నేడు కాస్త బ్రేక్ పడింది. దేశంలో గత కొద్ది రోజులుగా 2 లక్షలకు పైగా నమోదు అవుతూ కరోనా కేసులు నిన్న భారీగా తగ్గగా.. నేడు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యి కాస్త ఊరట కలిగించాయి. అయితే దేశవ్యాప్తంగా నిన్నతో పోలిస్తే నేడు కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 34 వేల 281 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
డైలీ పాజిటివిటి రేటు 14. 50 శాతంగా నమోదయింది. మహమ్మరితో తాజాగా 893 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం 18, 84, 937 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 3, 52, 784 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.
అయితే ఒమిక్రాన్ పట్ల ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.