TDP Vs YCP : వచ్చే సార్వత్రిక ఎన్నికల తీర్పు చెప్పేసిన ప్రజలు టీడీపీ VS వైసీపీ… గెలుపు ఎవరిదంటే..?
TDP Vs YCP : 2019 ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లో జగన్ పార్టీ విజయాలు సాధించటం మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జగన్ పార్టీ జెండా ఎగిరింది. దీంతో వచ్చే ఎన్నికలలో వెంట్రుకలు కూడా ఎవరు పీకలేరని… 175 కి 175 స్థానాలు కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని వైసీపీ నాయకులు తెగ కాలర్ ఎగరవేస్తున్నారు. ఎంతమంది వచ్చినా గాని సింహం సింగల్ గా వస్తుందని… వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని మొన్నటివరకు భారీ ఎత్తున ప్రకటనలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.
మేటర్ లోకీ వెళ్తే పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కారణం టీడీపీ పార్టీ పుంజుకుంది. తొమ్మిది జిల్లాలలో 108 నియోజకవర్గాలలో దాదాపు పదిలక్షల 500కు పైగా పట్టాభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరంతా జరిగిన పట్టాభద్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయటంతో… వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న టాక్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఏకంగా 108 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి అనీ టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఇదే సమయంలో ప్రజలలో వైసీపీ పై కనబడని ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పుకొస్తున్నారు. డిగ్రీ ఆపై చదువుకున్నవాళ్లు వైసీపీ పాలన చాలా చెత్తగా ఉందని తీర్పు ఇచ్చినట్లు అయింది. చదువుకున్న వారి ఆలోచన విధానం బట్టి జగన్ ప్రభుత్వం పై ప్రజలలో కోపం ఉందని పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు బట్టి తెలుస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర..లో కూడా ప్రజల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ పుంజుకుంటూ ఉండటంతో….ఆ క్యాడర్ లో జోష్ నెలకొంది.