7th Pay Commission
7th Pay Commission : గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచనుందని అనేక ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ బుధవారం (సెప్టెంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న కుటుంబ పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
డీఏను నాలుగు శాతం పెంచడంతో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం 34 శాతం నుంచి 38 శాతానికి పెంచినట్లుగా సమాచారం. ఈ పెంపు జూలై నుంచి డిసెంబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతం కాగా, ఇప్పుడు 4 శాతం నుంచి 38 శాతానికి పెంచారు. ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఆమోదించబడిన ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది. 4 శాతం డీఏ పెంపుతో కనీస వేతనం అందుకునే వారికి రూ. 720 పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం రూ. 18,000 అయితే, 34 శాతం ప్రకారం రూ. 6,120 డీఏ పొందేందుకు అర్హులు. డీఏ 38 శాతం కాగానే 4 శాతం పెంపుతో ఉద్యోగికి రూ. 6,840 లభిస్తుంది. అంటే రూ. 720 అదనంగా అందుతుంది.
4 percent DA Hike For Central Government employees 7th Pay Commission
చివరిసారిగా డీఏ మార్చి 2022లో పెంచబడింది. ఈ పెంపు సమయంలో,డీఏ జనవరి 1, 2022 నుండి అమల్లోకి రాగా, 34%కి పెరిగడం జరిగింది.7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం 2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ సమయంలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. దీనికి అదనంగా అక్టోబరులో మరోసారి కేంద్రం డీఏ పెంచింది. 2021 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 3 శాతం డీఏ పెంపునకు గత ఏడాది అక్టోబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ జూలై 1, 2021 నుండి 31 శాతం డీఏ లభించింది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం డీఏను మరో 3 శాతం పెంచాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34 శాతం డీఏ లభిస్తోంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.