7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. 4 శాతం పెరిగిన డీఏ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. 4 శాతం పెరిగిన డీఏ

7th Pay Commission : గ‌త కొద్ది రోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం డీఏ పెంచ‌నుంద‌ని అనేక ప్ర‌చారాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ బుధవారం (సెప్టెంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది డీఏ పెంపు వల్ల […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 September 2022,6:00 pm

7th Pay Commission : గ‌త కొద్ది రోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం డీఏ పెంచ‌నుంద‌ని అనేక ప్ర‌చారాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ బుధవారం (సెప్టెంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న కుటుంబ పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

7th Pay Commission : పెరిగిన డీఏ

డీఏను నాలుగు శాతం పెంచడంతో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం 34 శాతం నుంచి 38 శాతానికి పెంచినట్లుగా సమాచారం. ఈ పెంపు జూలై నుంచి డిసెంబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతం కాగా, ఇప్పుడు 4 శాతం నుంచి 38 శాతానికి పెంచారు. ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఆమోదించబడిన ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది. 4 శాతం డీఏ పెంపుతో కనీస వేతనం అందుకునే వారికి రూ. 720 పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం రూ. 18,000 అయితే, 34 శాతం ప్రకారం రూ. 6,120 డీఏ పొందేందుకు అర్హులు. డీఏ 38 శాతం కాగానే 4 శాతం పెంపుతో ఉద్యోగికి రూ. 6,840 లభిస్తుంది. అంటే రూ. 720 అదనంగా అందుతుంది.

4 percent DA Hike For Central Government employees 7th Pay Commission

4 percent DA Hike For Central Government employees 7th Pay Commission

చివరిసారిగా డీఏ మార్చి 2022లో పెంచబడింది. ఈ పెంపు సమయంలో,డీఏ జనవరి 1, 2022 నుండి అమల్లోకి రాగా, 34%కి పెరిగడం జ‌రిగింది.7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం 2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ సమయంలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. దీనికి అదనంగా అక్టోబరులో మరోసారి కేంద్రం డీఏ పెంచింది. 2021 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 3 శాతం డీఏ పెంపునకు గత ఏడాది అక్టోబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ జూలై 1, 2021 నుండి 31 శాతం డీఏ లభించింది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం డీఏను మరో 3 శాతం పెంచాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34 శాతం డీఏ లభిస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది