Electric Vehicle : ఒక్క సారి చార్జింగ్ చేస్తే 4వేల కిలోమీటర్లు.. ఈవీలో సంచలనం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Electric Vehicle : ఒక్క సారి చార్జింగ్ చేస్తే 4వేల కిలోమీటర్లు.. ఈవీలో సంచలనం..

Electric vehicle : ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ రికార్డుల సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 4వేల 11 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ బైక్ ను గ్రావ్టన్ మోటర్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ బైక్‌ను ఒక సారి ఛార్జింగ్ చేసి కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దంగ్ వరకు నడపించాు. ఇందుకు సుమారు 164 గంటల సమయం పట్టింది. ఈ బైక్ ఆసియా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :8 February 2022,2:20 pm

Electric vehicle : ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ రికార్డుల సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 4వేల 11 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ బైక్ ను గ్రావ్టన్ మోటర్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ బైక్‌ను ఒక సారి ఛార్జింగ్ చేసి కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దంగ్ వరకు నడపించాు. ఇందుకు సుమారు 164 గంటల సమయం పట్టింది. ఈ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ బైక్ సెప్టెంబర్ 13, 2021న కన్యాకుమారి నుంచి జెర్నీ ప్రారంభించింది ఈ బైక్. 2021 సెప్టెంబర్ 20న దీని ప్రయాణం ముగిసింది.

కన్యాకుమారి నుంచి మనాలి వరకు సుమారుగా 3,400 కిలో మీటర్లను నాన్‌స్టాప్‌గా జర్నీ చేశారు. ఆ తర్వాత మిగిలిన దూరాన్ని ప్రయాణించారు. ఈ మార్గంలో మెకానికల్‌కు సంబంధించిన సమస్యలు సైతం తెలెత్తలేదని బైక్ పై ప్రయాణించిన వారు చెబుతున్నారు.ఈ బైక్‌కు క్వాంటా (Quanta) అని పేరు పెట్టారు. ఈ బైక్ బ్యాటరీని సులువుగా మార్చవచ్చు. బ్యాటరీని నిర్దిష్ట స్టేషన్‌లో మార్చడం సాధ్యమవుతుంది. దీని రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించినందుకు తయారీదారు కృతజ్ఞతలు తెలిపారు.

4 thousand kilometers on a single charge Electric Vehicle

4 thousand kilometers on a single charge Electric Vehicle

Electric vehicle : క్వాంటా అని పేరు

భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన బైకులను తయారుచేస్తామని చెప్పారు. 2022 సంవత్సరం చివరి నాటికి ఈ బైక్‌లను భారీ ఎత్తున తయారు చేస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బైక్ గురించి వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. మరి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఛార్జింగ్ పెట్టే అవసరమే ఉండదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది