MLA Angad Kanhar : 70 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?
MLA Angad Kanhar : చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడో ఎమ్మెల్యే. చిన్నప్పుడు చదువుకోవడం వీలు కాని ఆయన ఏడు పదుల వయసులో పదో తరగతి పరీక్షలు రాసాడు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన చదివి పరీక్షలు రాయడం… అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతనా చాలా మంది ఆయన ద్వారా ప్రేరణ కూడా పొందుతున్నారు. ఒడిశాకు రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్… ఫుల్బాని నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 1978లోనే ఆయన తన చదువును ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినా పదో తరగతి చదవాలేకపోయాననే బాధ ఆయనను ఎప్పుడూ వెంటాడేది.
అయితే ఎలాగైనా సరే తాను చనిపోయేలోపు పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈ) నిర్వహిస్తున్న హైస్కూల్ వార్షిక పరీక్షలకు శుక్రవారం హాజరయ్యారు. ఆయన హాజరైన పరీక్షా కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరై వార్తల్లో నిలిచిన ఈ ఎమ్మెల్యేను… అందరూ అభినందిస్తున్నారు. ఆశయానికి వయసు ఎప్పుడూ అడ్డుకాదని సూచిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.71 లక్షల మంది విద్యార్తులు హాజరు అయ్యారు. మొత్తం 3 వేల 540 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. వారితో పాటు 9 వేల 378 మంది ఓపెన్ స్కూల్, 4 వేల 443 మంది మాధ్యమ పరీక్షలు రాశారు.
మేక 6లవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.అయితే ఇటీవలే కేరళకు చెందిన 104 ఏళ్ల వృద్ధురాలు కూడా లేటు వయసులో చదువుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్కూలు యాజమాన్యం పెట్టిన పరీక్షలో 100 మార్కులకు గాను 89 మార్కులు సంపాదించి ఆనందంతో ఉబ్బితబ్బిపైపోయింది. ఆమె మార్కులను చూసి మురిసిపోతూ… తనివితీరా నవ్విన నవ్వు చూసి.. కలెక్టర్ ఫిదా అయిపోయాడు. అంతే ఆ ఫొటోలను తన సెల్ ఫోన్ లో బంధించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వార్త చూసిన ప్రతీ ఒక్కరూ.. బామ్మని పొగడడంలో మునిగిపోయారు. వందేళ్లు దాటినా చదువుకోవాలనే తపన ఉన్న ఆమె.. నేటి బాల్యానికి, యువతకు ఆదర్శమంటూ కామెంట్లు చేశారు.