7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లలో జమ కానున్న 18 నెలల డీఏ బకాయిలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. 18 నెలల డీఏ బకాయిలపై శుభవార్త చెప్పింది. నిజానికి ఈ 18 నెలల బకాయిల గురించి చాలా రోజుల నుంచి కేంద్రం చెబుతున్నా ఇప్పటి వరకు బకాయిల డబ్బు ఉద్యోగుల అకౌంట్లలో పడలేదు. తాజాగా ఈ బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 18 నెలల బకాయిలను ఉద్యోగులకు చెల్లించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాకపోతే 18 నెలల బకాయిలను ఒకేసారి కాకుండా 8 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లించనున్నారు.
మరోవైపు డీఏ, డీఆర్ పెంపుపై కూడా ఉద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ.. డీఏ పెంపుపై నిర్ణయం ఈనెలలో ఉండకపోవచ్చని అంటన్నారు. మార్చి నెలలో డీఏ, డీఆర్ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందట. కాకపోతే.. డీఏ పెంపు అమలు మాత్రం జనవరి 1, 2023 నుంచే ఉంటుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. అయితే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను సపరేట్ గా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
7th Pay Commission : తెలంగాణలోనూ పెరగనున్న డీఏ
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ ను పెంచింది. 2.73 శాతం పెంచగా.. ప్రస్తుతం ఉన్న 17.29 శాతం నుంచి 20.02 శాతానికి చేరుకుంది. తెలంగాణ మంత్రి హరీశ్ రావు.. డీఏ పెంపు ప్రకటనను చేశారు. పెరిగిన డీఏను జులై 1, 2021 నుంచి అమలు చేయనున్నారు. అయితే.. డీఏ బకాయిలు మొత్తాన్ని కేంద్రం వాయిదాల్లో చెల్లించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 8 వాయిదాల్లో జీపీఎఫ్ అకౌంట్లలో జమ చేయనుంది. డీఏ పెంపుపై, బకాయిల చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు.