7th Pay Commission : సెవెంత్ పే కమీషన్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీ.ఆర్ బకాయులు చెల్లింపులతో పాటు భారీ నజరానా కూడా..!
ప్రధానాంశాలు:
7th Pay Commission : సెవెంత్ పే కమీషన్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీ.ఆర్ బకాయులు చెల్లింపులతో పాటు భారీ నజరానా కూడా..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ రిలీఫ్ బకాయిల చెల్లింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద్. ఉద్యోగులకు డీ.ఆర్ లెక్కించి ప్రాసెస్ చేయాలని బ్యాంక్ లకు ఆదేశాలు జారీ చేసింది. కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్లు, ఉద్యోగంలో ఉన్న పెషనర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. సుప్రీం కోర్టు, హై కోర్ట్ రిటైర్ న్యాయమూర్తులకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయబడతాయని తెలుస్తుంది. డీ.ఆర్ విషయంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ లో పెన్షన్ పంపిణీ కంటే ముందు డీ.ఆర్ బకాయిలు చెల్లించేలా చూస్తున్నారు.
7th Pay Commission తాత్కాలిక పెన్షన్ తీసుకునే వారికి..
డీ.ఆర్ పెంపు తో పెన్షనర్లు, సాయుధ దళాల పెన్షనర్లు, రైల్వే పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఇది తాత్కాలిక పెన్షన్ తీసుకునే వారితో పాటుగా బర్మా, పాకిస్తాన్ నుంచి వచ్చ్ ప్రభుత్వం పెన్షనర్లకు కూడా చెందుతుంది. డీ.ఏ, డీ.ఆర్ ల పెరిగిన వేతనం అక్టోబర్ నెల నుంచి ఇస్తారు. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53 శాతం పెన్షనర్లు డీ.ఆర్ 53 శతం పెరిగింది. అక్టోబర్ నెలలో భారీగా డీ.ఆర్, డీ.ఏ అందింది.
7వ వేతన సంఘం ప్రకరం కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు రిటైర్ అయిన వారికి ఈ మెమరాండం జారీ చేసింది. దీని ప్రకారం 2024 అక్టొబర్ నెలలో షెడ్యూల్ చేసిన పెన్షన్ కంటే ముందే ఈ.ఆర్ బకాయిలు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లు ఈ డీ.ఆర్ పెంపు సంతోషకరమని చెప్పొచ్చు. సెనెంత్ పే కమీషన్ లో భాగంగా కేవలం డీ.ఆర్, డీ.ఏలను మాత్రమే పెంచారు. జీత భర్యాల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.