7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై వ‌చ్చే వారం ప్ర‌క‌ట‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై వ‌చ్చే వారం ప్ర‌క‌ట‌న‌

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. ఉద్యోగుల జీతం ఏకంగా 40 వేల వరకూ పెరగనుంది. ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం డీఏ ఈసారి 5-6 శాతం పెరగడం ఖాయమని తెలుస్తోంది. తుది ప్రకటన మాత్రం ఆగస్టు 3వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం వెలువడనుంది. కేబినెట్ భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :31 July 2022,6:00 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. ఉద్యోగుల జీతం ఏకంగా 40 వేల వరకూ పెరగనుంది. ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం డీఏ ఈసారి 5-6 శాతం పెరగడం ఖాయమని తెలుస్తోంది. తుది ప్రకటన మాత్రం ఆగస్టు 3వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం వెలువడనుంది. కేబినెట్ భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుందని సమాచారం. ఈ భేటీలో డీఏతో పాటు ఉద్యోగుల జీతం విషయంలో కూడా అప్‌డేట్ రానుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు 18 నెలల డీఏ ఎరియర్స్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

రెండో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) సవరణను జూలై 31 (నేడు)లోపు ప్రకటిస్తారని మునుపటి నివేదికలు సూచించగా, తాజా నివేదికల ప్రకారం ఆగస్టు 3 నాటికి ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. 5 లేదా 6 శాతం డీఏ పెంపు ఉంటుంద‌ని ముందుగా ప్ర‌చారం జ‌రిగింది. కాని 4 శాతం డీఏ మాత్ర‌మే పెర‌గ‌నుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంతకుముందు సంవత్సరం ప్రారంభంలో 3 శాతం డీఏ పెంపు లభించింది . అంతకు ముందు సంవత్సరం 2020 జనవరి , జూన్ 2020, జనవరి 2021 కరవు భత్యాన్ని కరోనా మహమ్మారి నేపధ్యంలో నిలిపివేశారు. ఆ తరువాత ఆమోదముద్ర లభించినా..ఇప్పటికీ ఆ 18 నెలల డీఏ క్లియర్ కాలేదు.

7th Pay Commission 4 da hike 18 months arrears coming soon

7th Pay Commission 4 da hike 18 months arrears coming soon

7th Pay Commission : ఈ సారి ప‌క్కా..

డీఏలో 4 శాతం పెంపుదల రూ. 18,000 బేసిక్ జీతం కోసం సంవత్సరానికి రూ. 8,640 మరియు రూ. 56,000 బేసిక్ జీతం కోసం సంవత్సరానికి రూ. 27,312 పెరుగుతుంది. ప్రస్తుతం, రూ.18,000 బేసిక్ జీతం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం అంటే నెలకు రూ.6120 డీఏ లభిస్తుంది. ఈ మొత్తం నెలకు రూ. 6,840కి పెరిగే అవకాశం ఉంది, దీని ప్రకారం నెలవారీ డీఏ రూ.720 మరియు సంవత్సరానికి రూ.8,640 పెరుగుతుంది. రూ. 56,000 బేసిక్ జీతం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రస్తుతం నెలవారీగా అందుతున్న డీఏ రూ.19,346 కాగా, డీఏ పెంపు నెలకు రూ.2,276 పెరిగి రూ.21,622కి చేరుకుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది