Anchor Shyamala : యాంకర్ శ్యామల అప్పట్లో ఓ ట్రెండ్. బుల్లితెరపై సీరియల్స్, ప్రోగ్రాంలు, వంటల షోలు అంటూ ఫుల్ బిజీగా ఉండేది. ఇక మధ్యలో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో సీజన్‌లో శ్యామల ఎంట్రీ ఇచ్చింది. మధ్యలోనే బయటకు వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అలా శ్యామలకు బిగ్ బాస్ ఏమీ అంతగా ఉపయోగపడలేదు. కాకపోతే కొంత మంది కొత్త స్నేహితులు ఆమె లిస్ట్‌లోకి వచ్చారు. గీతా మాధురి, శ్యామల, దీప్తి ఇలా ఓ గ్యాంగ్‌లా ఉండేవారు. యాంకర్ శ్యామల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన యూట్యూబ్ చానెల్, ఇన్ స్టాగ్రాం, రీల్ వీడియోలంటూ అభిమానులను అలరిస్తోంది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లతోనూ బాగానే సంపాదించేస్తోంది. మొన్నటికి మొన్న యాంకర్ శ్యామల మీద ఆర్జీవీ కన్ను పడింది. ఇంత అందమైన యాంకర్ నా కంట ఎందుకు పడలేదు అంటూ శ్యామలను స్టేజ్ మీదే పొగిడేశాడు ఆర్జీవీ. అలా శ్యామల మరోసారి వర్మ మూలాన ట్రెండ్ అయింది. అంతకు ముందు శ్యామల చుట్టూ కాంట్రవర్సీలు బిగిశాయి. ఆమె భర్త ఓ మహిళను మోసం చేశాడని, కోటి రూపాయలు ఎగ్గొట్టాడంటూ కేసులు పెట్టారు. దీంతో శ్యామల చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. కానీ వాటి నుంచి ఇప్పుడు ఆమెకు ఉపశమనం కలిగినట్టుంది. ఇక తన కొడుకు ఇషాన్ గురించి చెబుతూ ఆమె వీడియోలు చేస్తుంటుంది.
యూట్యూబ్ చానెల్‌లో ఆమె చేసే వీడియోలు, చెప్పే పర్సనల్ విషయాలు, వంటింటి సంగతులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఈమె రీల్ వీడియోలు, అందులో ఆమె డ్రెస్సింగ్, వేసే స్టెప్పులు ఎక్కువగా ట్రెండ్ అవుతాయి. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గంలోని రాను రాను అంటూనే చిన్నదో అనే పాట ట్రెండ్‌లో ఉంది. అంజలి, నితిన్ వేసిన ఈ స్టెప్పులను రీల్ వీడియోలుగా చేస్తున్నారు. తాజాగా శ్యామల కూడా తన నడుమును తెగ ఊపేసింది. రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో.. అంటూ శ్యామల స్టెప్పులు వేసింది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.