7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త చెప్పబోతున్నమోదీ సర్కారు.. ఒకేసారి మూడు బంపర్ ఆఫర్స్
7th Pay Commission : సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మోదీ సర్కార్ శుభవార్త అందించనుంది. ట్రిపుల్ బొనాంజా నిర్ణయం విషయం తెలుసుకున్న ఉద్యోగులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మోదీ ప్రభుత్వం అందించనున్న గుడ్ న్యూస్ లలో మొదటిది ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్. ఇది మరోసారి 4 శాతం పెరగనుంది.రెండోది ఉన్న డీఏ బకాయిలపై ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలపై నిర్ణయం తీసుకోవచ్చు. అదే సమయంలో మూడవది ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించినది, దీని కింద PF ఖాతాలోని వడ్డీ డబ్బు ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్‌లో రానుందని అంటున్నారు.
7th Pay Commission : శుభవార్తలు..
డీఏ పెరుగుదల ఏఐసీపీఐ డేటాపై ఆధారపడి ఉంటుంది. జూన్‌లో ఏఐసీపీఐ ఇండెక్స్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఫిబ్రవరి తర్వాత ఇది వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జూన్ లో మే కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మే నెలలో 1.3 పాయింట్లు లాభపడి 129 పాయింట్లకు పెరిగింది. జూన్ సంఖ్య 129.2కి చేరుకుంది. ఇప్పుడు సెప్టెంబరులో డియర్‌నెస్ అలవెన్స్‌లో 4% పెరుగుదల అంచనా వేయబడింది. డీర్ కూడా కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉండడంతో త్వరలోనే దీనిపై మోదీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ 2020 మేలో 30 జూన్ 2021 వరకు డీఏ పెంపును నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క 7 కోట్ల మందికి పైగా ఖాతాదారుల ఖాతాలో పీఎఫ్ డబ్బులు కూడా పడబోతున్నట్టు సమాచారం. ఈసారి 8.1% ప్రకారం.. పీఎఫ్ వడ్డీ ఖాతాలోకి వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు మరి చూడాలి ఈ ట్రిపుల్ బొనాంజా ఆఫర్ సెప్టెంబర్ లో ఇస్తారా లేదంటే ఇంకా పొడిగిస్తారా అనేది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ నిర్ణయించేందుకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా భావిస్తారు. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ తొలి ఆరు నెలల గణాంకాంలు వచ్చేశాయి. జూన్ నెల సూచచీ 129.2కు చేరుకుంది. ఇండెక్స్ పెరగడంతో డీఏ 4 శాతం పెరగడం ఖాయమైంది. కరవు భత్యం 4 శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుకుంటుంది. పెరిగిన డీఏను సెప్టెంబర్ నెల జీతంతో ఇవ్వనున్నారు