7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి హోలీ సందర్భంగా గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతంటే?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి హోలీ సందర్భంగా గుడ్ న్యూస్ రాబోతోంది. అవును.. డీఏ పెంపుపై కీలక అప్ డేట్ రాబోతోంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెంపుపై కేంద్రం హోలీ సందర్భంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్(ఏఐసీపీఐ)ని ఫిబ్రవరి 28న కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో హోలీ పండుగ సందర్భంగా డీఏ పెంపుపై ఏఐసీపీఐ […]
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి హోలీ సందర్భంగా గుడ్ న్యూస్ రాబోతోంది. అవును.. డీఏ పెంపుపై కీలక అప్ డేట్ రాబోతోంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెంపుపై కేంద్రం హోలీ సందర్భంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్(ఏఐసీపీఐ)ని ఫిబ్రవరి 28న కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో హోలీ పండుగ సందర్భంగా డీఏ పెంపుపై ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
గత సంవత్సరం డిసెంబర్ 2022లో ఏఐసీపీఐ స్టాటిస్టిక్స్ చూస్తే 132.3 గా ఉంది. ఇండెక్స్ ప్రకారం చూస్తే డీఏను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచుతారు. ప్రస్తుతం 38 శాతంగా డీఏ ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో డీఏను 4 శాతం పెంచారు. 34 శాతం నుంచి 38 శాతం డీఏ పెరిగింది. మరో 3 శాతం పెరిగి 41 శాతానికి పెరగనుంది.ఒకవేళ 38 శాతం నుంచి 41 శాతానికి డీఏ పెరిగితే..
7th Pay Commission : 38 నుంచి 41 శాతానికి డీఏ పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది?
కనీసం వేతనం రూ.18 వేలు ఉన్నవాళ్లకు 41 శాతం డీఏ ప్రకారం లెక్కిస్తే నెలకు రూ.7380 డీఏ వస్తుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం ప్రకారం చూస్తే రూ.6840 గా ఉంది. అంటే.. 3 శాతం పెరిగితే నెలకు రూ.900 పెరుగుతుంది. సంవత్సరానికి చూసుకుంటే రూ.10,800 అవుతుంది. అదే బేసిక్ వేతనం రూ.56,900 తీసుకునే వాళ్లకు 41 శాతం ప్రకారం డీఏ చూసుకుంటే రూ.23,329 అవుతుంది. 38 శాతం డీఏ ప్రకారం చూసుకుంటే రూ.21,622 అవుతుంది. నెలకు రూ.1707 అంటే సంవత్సరానికి రూ.20,484 అవుతుంది.