7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు డీఏ పెంపు కోసం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం డీఏ అందుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 2022 లో డీఏ పెరిగింది. 34 శాతం పెరిగింది. కానీ.. ఇప్పుడు మరో 4 శాతం పెరగనుంది. అది కాస్త 38 శాతం అవ్వనుంది. త్వరలో హోలీ పండుగ రాబోతోంది. ఈ పండుగ సందర్భంగా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెరగనున్నట్టు తెలుస్తోంది.
హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్టు తెలుస్తోంది. డీఏ బకాయిలపై కూడా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోలీ సందర్భంగా డీఏ పెంపు, డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా నిర్ణయం తీసుకొని ఒకేసారి మూడు గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పే అవకాశం ఉంది.
7th Pay Commission : డీఏ బకాయిలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం
మార్చి 1న కేంద్ర కేబినేట్ భేటీ కానుంది. డీఏ పెంపుపై ఆరోజే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే డీఏ పెంపుతో పాటు 18 నెలల డీఏ బకాయిలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో మార్చిలోనే పడనున్నాయి. 18 నెలల డీఏ బకాయిలు అంటే కనీసం ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల వరకు రానున్నాయి. అంటే వచ్చే నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని పండుగలను ఒకేసారి తీసుకురానున్నదన్నమాట.