7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే పెరుగుతున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ గురించి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. 2023 జులై లో పెరగాల్సిన డీఏకు సంబంధించి కీలక అప్ డేట్ త్వరలోనే రాబోతోంది. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరగాలి. ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెరుగుతుంది. కానీ.. దానికి సంబంధించిన డీఏను దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. దసరా, దీపావళి సమయం అంటే అది అక్టోబర్, నవంబర్ నెల. కాకపోతే జులై నుంచి ఉన్న బకాయిలను కూడా చెల్లిస్తారు.
కానీ.. ఈసారి డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి దసరా, దీపావళికి కాకుండా ముందే డీఏను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అంటే అక్టోబర్ లో కాకుండా సెప్టెంబర్ లోనే డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒక నెల రోజుల ముందుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. డీఏతో పాటు ఫించనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది.
7th Pay Commission : డీఏ ఎంత శాతం పెరగనుంది?
గత మార్చిలో డీఏ 4 శాతం పెరిగింది. అది కూడా జనవరిలో పెరగాలి కానీ.. డీఏను మార్చిలో పెంచారు. 38 శాతం నుంచి 42 శాతం అయింది. అంతకుముందు డీఏ 38 శాతంగా ఉండేది. ఇప్పుడు 42 శాతం నుంచి మరో 3 శాతం డీఏ పెరగనున్నట్టు తెలుస్తోంది. 3 శాతం డీఏ పెరిగితే ఆ డీఏ కాస్త 45 శాతం అవుతుంది. అయితే.. ఈసారి ఒక శాతం డీఏ తగ్గనుంది. దానికి కారణం.. సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్. సీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏను 3 శాతమే పెంచబోతున్నారు. నిజానికి ఉద్యోగులు ఈసారి కూడా 4 శాతమే పెరుగుతుందని భావించినా 42 నుంచి 3 శాతం పెంచి 45 శాతానికి డీఏను పెంచబోతున్నట్టు తెలుస్తోంది. జూన్ 2023 కి సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ 2023 ఇండెక్స్ పాయింట్స్ గతంతో పోల్చితే పెరగడంతో ఇక చేసేది లేక డీఏను మూడు శాతమే పెంచుతున్నట్టు తెలుస్తోంది.