7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త .. నేడు డీఏ, పెన్షన్స్‌పై కేంద్రం కీలక ప్రకటన?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నేడు మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు అందించబోతోందా? డియర్‌నెస్ అలవెన్స్‌కు DA సంబంధించి ఈరోజు కీలక ప్రకటన చేయనుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 4 శాతం డీఏ పెంపు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు జరుగుతుంది. మొదటిది జనవరి నుండి జూన్ వరకు ఇవ్వబడుతుంది, రెండవది జూలై నుండి డిసెంబర్ వరకు వస్తుంది.
ఈసారి డీఏ పెంపు 4 శాతం ఉండవచ్చని, దీన్ని మొత్తం 38 శాతానికి చేర్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగ డీఏ సవరణ అనేది గత ఏడాదిన్నర కాలంగా జరగలేదు. 2021 జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచిన విషయం మనకు తెలిసిందే.అలాగే 2021 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం మేర పెంచారు. ఈ పెంపు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డీఏ 31 శాతానికి చేరింది.
7th Pay Commission : డీఏ పెంపు
ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం డీఏ 4, డీఆర్‌ను 3 శాతం చొప్పున పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల 50 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు ఊరట కలుగనుంది. ఉద్యోగి పని చేసే ప్రాంతం ప్రాతిపదికన డియర్‌నెస్ అలవెన్స్‌లో మార్పు ఉంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతానికి పైగా నమోదు అవుతోంది. దీంతో ఉద్యోగులు ఇంకా ఎక్కువ డీఏ పెంపును ఆశిస్తున్నారు. మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.