7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవరాత్రులు, దసరా, దీపావళి సందర్భంగా డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. నిజానికి గత జులైలోనే డీఏ పెరగాలి. కానీ.. పెరగలేదు. ప్రస్తుతం ఉన్న 34 శాతం డీఏను 38 శాతంగా చేశారు. జులై 1, 2022 నుంచి డీఏ అమలులోకి రానుంది. డీఏతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్రం.
డీఏతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ ను కూడా పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దానిపై కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు పని చేసే ప్రాంతాన్ని బట్టి వారికి ఇంటి అద్దె చెల్లిస్తుంటారు. ఇంటి అద్దె చెల్లింపును మూడు పద్ధతులలో చేస్తుంటారు. వారి బేసిక్ శాలరీలో 27 శాతం చొప్పున ఇంటి అద్దె భత్యం చెల్లిస్తారు. అదే వై కేటగిరీ ఉద్యోగులు అయితే వారి బేసిక్ జీతంలో 18 నుంచి 20 శాతం చొప్పున ఇంటి అద్దె లభిస్తుంది. జెడ్ కేటగిరీ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం ఇంటి అద్దె భత్యం లభిస్తుంది.
7th Pay Commission : జెడ్ కేటగిరీ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం ఇంటి అద్దె భత్యం
అయితే.. ఇది ఉద్యోగి పని చేసే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇంటి అద్దె భత్యాన్ని 3 శాతం నుంచి 4 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే డీఏను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ డీఏను 34 శాతం నుంచి 38 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ డీఏ జులై 1, 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు అమలులో ఉంటుంది. డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఊరట లభిస్తుంది. వాళ్లకు కూడా డీఆర్ ను కేంద్రం పెంచింది.