7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి త్వరలోనే డీఏ పెంపు… డీటైల్స్ ఇవే..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్నాళ్లుగా డీఏ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు డీఏపై అనౌన్స్‌మెంట్ వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. దాదాపు 2,3 నెలలుగా ఉద్యోగులు డీఏ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొదటి డీఏని మార్చిలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెండో డీఏని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. జూలై, ఆగస్టులోనే దీనిపై ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా డీఏ పెంపు ప్రకటనపై కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్‌లో డీఏ పెంపు ఉండొచ్చునని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఉండొచ్చునని తెలుస్తోంది.
7th Pay Commission : కీలక అప్‌డేట్..
నవరాత్రుల మూడో రోజైన సెప్టెంబర్ 28న డీఏ పెంపుపై ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే డీఏ కోసం ఎంతగో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల కోసం కీలక అప్‌డేట్ ఒకటి వచ్చింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఈసారి డీఏ పెంపు మరో 4 శాతం ఉండొచ్చుననే అంచనాలు నెలకొన్నాయి. అదే జరిగితే డీఏ 38 శాతం వరకు పెరుగుతుంది. సాధారణంగా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా కేంద్రం డీఏ పెంపు ప్రకటిస్తుంది. ఈ ఏడాది జూన్ మాసానికి ఏఐసీపీఐ ఇండెక్స్ 129.2 పాయింట్లుగా ఉంది.
కొద్ది నెలలుగా ఏఐసీపీఐ ట్రెండ్ గమనిస్తే క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కాలంలో 18 నెలల కాలానికి నిలిచిపోయిన డీఏ చెల్లింపులను కూడా కేంద్రం ఈసారి చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకేసారి ఆ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లయితే దసరా పండగ ముందు ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపినట్లే. అయితే పెరిగిన డీఏతో పాటు డీఏ ఏరియర్స్‌ను సెప్టెంబర్ నెల వేతనంతో కేంద్రం చెల్లిస్తుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైన ఈ నెలలో మాత్రం కేంద్రం నుండి గుడ్ న్యూస్ అయితే రానుందని తెలుస్తుంది.