Categories: ExclusiveNewsTrending

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం పెరిగిన డీఏ.. అస‌లు లెక్కలు ఇవే..!

7th Pay Commission : గ‌త కొద్ది రోజుల నుండి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ని ఊరిస్తూ వ‌స్తున్న కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు డీఏ పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు మరో 3 శాతం డీఏ (డియర్​నెస్ అలవెన్స్​) పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డీఏ వర్తించనుంది. పెరిగిన డిఏ అమలులోకి వస్తే.. బేసిస్​ శాలరీలో డీఏ 34 శాతానికి చేరనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్​ (డియర్​నెస్ రిలీఫ్​)ను.. ఆల్​ ఇండియా కన్సూమర్​ ప్రైజ్ ఇండెక్స్​ ఫర్​ ఇండస్ట్రీయల్ వర్కర్స్​ ప్రకారం లెక్కిస్తారు.

దీనిని లేబర్​ బ్యూరో ఆఫ్​ లేబర్​ అండ్ ఎంప్లాయ్​మెంట్​ విడుదల చేస్తుంది. అంటే ఉద్యోగులకు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో డీఏను పెంచుతూ ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు DA, DRలను సవరిస్తుంది. జనవరి, జూలైలో ఇది జరుగుతుంది. అయితే ఉద్యోగి ఎక్కడ ఉన్నారనే దాని ఆధారంగా ఇది ఉంటుంది. కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డీఏ, డీఆర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే జూలై 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 17 శాతంగా ఉన్న DA, DRలను 28 శాతానికి పెంచింది. అక్టోబర్ 2021లో ఇది మరో 3 శాతం పెరిగింది.

7th pay commission da hiked by 3 check calculation here

దీంతో 31 శాతానికి చేరుకుంది. తాజాగా మరో 3 శాతం డీఏ, డీఆర్ పెంచేేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో.. ఇది 34 శాతానికి చేరుకుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను ఉద్యోగి మూల వేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. ఈ లెక్కన చూస్తే తాజా డీఏ పెంపుతో స్థూల జీతం రూ.20,000 వరకు పెరగనుంది.3% DA పెంపుదల అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం DA ఇప్పుడు 34% అవుతుంది. దీని ప్రకారం, రూ. 18,000 ప్రాథమిక వేతనం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వార్షిక డీఏ రూ.73,440 అందుకుంటారు.

దిగువ లెక్క‌ల‌ను గ‌మ‌నించండి..

3% పెంపు తర్వాత కనీస ప్రాథమిక జీతం లెక్కింపు

– ప్రాథమిక వేతనం: రూ. 18,000

– పెంపు తర్వాత DA (34%) రూ. 6120/నెలకు

– పెంపుకు ముందు DA (31%) రూ. 5580/నెలకు

– డీఏ పెంపు – 6120- 5580 = రూ. 540/నెలకు

– వార్షిక వేతనం పెంపు – 540X12 = రూ.6,480

3% పెంపు తర్వాత గరిష్ట ప్రాథమిక జీతం లెక్కింపు

– ప్రాథమిక వేతనం: రూ. 56900

– పెంపు తర్వాత DA (34%) రూ 19346 / నెల

– పెంపుకు ముందు డీఏ (31%) రూ. 17639/నెలకు

– పెరిగిన తర్వాత ఎంత DA – 19346-17639 = 1,707 రూ/నెలకు

– వార్షిక వేతనంలో పెంపు – 1,707 X12 = రూ. 20,484

డీఏ పెంచిన త‌ర్వాత దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

Recent Posts

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

22 minutes ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

1 hour ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

2 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

3 hours ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

4 hours ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

5 hours ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

6 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

15 hours ago