7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం పెరిగిన డీఏ.. అసలు లెక్కలు ఇవే..!
7th Pay Commission : గత కొద్ది రోజుల నుండి ప్రభుత్వ ఉద్యోగులని ఊరిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు డీఏ పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు మరో 3 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డీఏ వర్తించనుంది. పెరిగిన డిఏ అమలులోకి వస్తే.. బేసిస్ శాలరీలో డీఏ 34 శాతానికి చేరనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న […]
7th Pay Commission : గత కొద్ది రోజుల నుండి ప్రభుత్వ ఉద్యోగులని ఊరిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు డీఏ పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు మరో 3 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డీఏ వర్తించనుంది. పెరిగిన డిఏ అమలులోకి వస్తే.. బేసిస్ శాలరీలో డీఏ 34 శాతానికి చేరనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్)ను.. ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ ప్రకారం లెక్కిస్తారు.
దీనిని లేబర్ బ్యూరో ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేస్తుంది. అంటే ఉద్యోగులకు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో డీఏను పెంచుతూ ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు DA, DRలను సవరిస్తుంది. జనవరి, జూలైలో ఇది జరుగుతుంది. అయితే ఉద్యోగి ఎక్కడ ఉన్నారనే దాని ఆధారంగా ఇది ఉంటుంది. కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డీఏ, డీఆర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే జూలై 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 17 శాతంగా ఉన్న DA, DRలను 28 శాతానికి పెంచింది. అక్టోబర్ 2021లో ఇది మరో 3 శాతం పెరిగింది.
దీంతో 31 శాతానికి చేరుకుంది. తాజాగా మరో 3 శాతం డీఏ, డీఆర్ పెంచేేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో.. ఇది 34 శాతానికి చేరుకుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను ఉద్యోగి మూల వేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. ఈ లెక్కన చూస్తే తాజా డీఏ పెంపుతో స్థూల జీతం రూ.20,000 వరకు పెరగనుంది.3% DA పెంపుదల అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం DA ఇప్పుడు 34% అవుతుంది. దీని ప్రకారం, రూ. 18,000 ప్రాథమిక వేతనం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వార్షిక డీఏ రూ.73,440 అందుకుంటారు.
దిగువ లెక్కలను గమనించండి..
3% పెంపు తర్వాత కనీస ప్రాథమిక జీతం లెక్కింపు
– ప్రాథమిక వేతనం: రూ. 18,000
– పెంపు తర్వాత DA (34%) రూ. 6120/నెలకు
– పెంపుకు ముందు DA (31%) రూ. 5580/నెలకు
– డీఏ పెంపు – 6120- 5580 = రూ. 540/నెలకు
– వార్షిక వేతనం పెంపు – 540X12 = రూ.6,480
3% పెంపు తర్వాత గరిష్ట ప్రాథమిక జీతం లెక్కింపు
– ప్రాథమిక వేతనం: రూ. 56900
– పెంపు తర్వాత DA (34%) రూ 19346 / నెల
– పెంపుకు ముందు డీఏ (31%) రూ. 17639/నెలకు
– పెరిగిన తర్వాత ఎంత DA – 19346-17639 = 1,707 రూ/నెలకు
– వార్షిక వేతనంలో పెంపు – 1,707 X12 = రూ. 20,484
డీఏ పెంచిన తర్వాత దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.