7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డబుల్ దమాకా.. భారీగా పెరగనున్న జీతాలు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 14, 2023, 6:00 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా ఒకటి కాదు. రెండు శుభవార్తలు. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరుగుతుంది తెలుసు కదా. ప్రతీ ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంది. అది జనవరిలో ఒకసారి, జులైలో మరోసారి. ఈ రెండు డీఏలు ప్రతి సంవత్సరం పెరుగుతాయి. తద్వారా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఇప్పటికే జనవరి 2023 కు సంబంధించిన డీఏ పెరిగింది. మార్చిలో పెరిగినా.. జనవరి 2023 నుంచే అది అమలులోకి వచ్చింది.

7th Pay Commission good news to central govt employees about da hike

7th Pay Commission good news to central govt employees about da hike

ఇక.. జులై 2023 లో పెరగాల్సిన డీఏ పెంపుపై కూడా త్వరలో ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపుతో పాటు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా త్వరలోనే శుభవార్త వచ్చే చాన్స్ ఉంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా కేంద్రం పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ద్వారా బేసిక్ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెరుగుతుంది. డీఏ పెంపు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కేంద్రం ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

7th Pay Commission good news to central govt employees about da hike

7th Pay Commission good news to central govt employees about da hike

7th Pay Commission : ఒకేసారి డీఏ, ఫిట్ మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం

ప్రస్తుతం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. డీఏ మొన్న మార్చిలో పెరిగిన 4 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 42 శాతం పెరిగింది. అది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. 2023 జులైలో డీఏ 4 శాతం పెరిగితే 42 నుంచి డీఏ 46 శాతానికి పెరిగే చాన్స్ ఉంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. వీటితో పాటు కోవిడ్ సమయంలో పెండింగ్ లో ఉన్న 18 నెలల డీఏ బకాయిలు కూడా రావాల్సి ఉంది. 18 నెలల బకాయిలు కనీసం రూ.2 లక్షల వరకు ఉంటాయి. అలాగే.. ఏడో వేతన సంఘాన్ని మార్చి ఎనిమిదో పే కమిషన్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp