7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులైలో పెరగనున్న డీఏ.. ఎంతంటే?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే మార్చి నెలలో డీఏ పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ జులైలో డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. ప్రతి సంవత్సరం డీఏ రెండు సార్లు పెరుగుతుంది. జనవరి, జులైలో ప్రతి సంవత్సరం రెండు సార్లు పెరుగుతుంది. గత జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. మరోసారి జులైలో పెరగనుంది. గత నెలలో 4 శాతం డీఏ పెరిగింది. అది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. డీఏ, డీఆర్ పెరిగింది.
ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఫిబ్రవరి 2023 లో 0.1 పాయింట్స్ తగ్గింది. 132.7 పాయింట్స్ కి చేరింది. జనవరి 2023 లో ఆల్ ఇండియా ఇండెక్స్ ప్రకారం 132.8 పాయింట్స్ ఉంది. 28 ఏప్రిల్ 2023న మార్చి 2023 కి సంబంధించిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి డేటా ప్రకారం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్.. 3 శాతం పెరగనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ 42 శాతంగా ఉంది. జులై 2023లో జరగనున్న సవరణలో 45 శాతంగా డీఏ పెరిగే అవకాశం ఉంది.
7th Pay Commission : ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ
ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను మరో 3 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హర్యానా ప్రభుత్వం గత వారమే డీఏను 4 శాతానికి పెంచింది. 38 శాతంగా ఉన్న డీఏ.. 42 శాతానికి పెంచారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల.. 3 శాతం డీఏను పెంచింది. ఇదివరకు 31 శాతంగా ఉన్న డీఏ.. 34 శాతానికి పెంచారు. దీని వల్ల.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 2.15 లక్షల మంది ఉద్యోగులకు, 1.90 పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. దీని వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో రూ.500 కోట్ల భారం పడనుంది.