7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పేస్కేల్ పెంపుకే అదిరిపోయే అప్ డేట్
7th Pay Commission : కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు త్వరలోనే పేస్కేల్ ను పెంచనున్నారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘానికి ఆరు నెలల పాటు చైర్మన్ గా ఉండేలా కర్ణాటక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ సుధాకర్ రావును నియమించారు. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీబీ రామమూర్తి, శ్రీకాంత్, వనవల్లిలను ప్యానెల్ కు సభ్యులుగా చేర్చారు. ప్యానెల్ మెంబర్ సెక్రటరీగా హెప్ సిబా రాని కొర్లపాటిని నియమించారు.
2022 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్ పెంపుపై ఈ ప్యానెల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే.. ఈ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్ పెంపు విషయంతో పాటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ స్టాఫ్, పార్కులు, రిటైర్ అయిన వాళ్లకు రెసిడెన్సీలు, వీటన్నింటిపై కమిషన్ నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే.. సీజీహెచ్ఎస్ స్కీమ్ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగులకు ఇచ్చే హాస్పిటల్ ట్రీట్ మెంట్ రికమెండేషన్స్ పై కూడా ఈ ప్యానెల్ సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
7th Pay Commission : రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించనున్న కమిషన్
సీజీహెచ్ఎస్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే రూ.50,500 బేసిక్ వేతనం ఉన్నవాళ్లే అర్హులు అవుతారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వార్డ్స్ లకు అర్హత సాధిస్తారు. కానీ.. అక్టోబర్ 28, 2022 నుంచి బేసిక్ వేతనం విషయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. జనరల్ వాళ్లకు రూ.36,500 వరకు, సెమీ ప్రైవేట్ అయితే.. రూ.36,501 నుంచి రూ.50,500 వరకు, ప్రైవేటు అయితే రూ.50,500 పైన జీతం ఉంటే అర్హత లభిస్తుంది.