7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో భారీగా అకౌంట్లలో జమ కానున్న నగదు.. ఎలా అంటే?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఎందుకంటే.. ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో త్వరలో భారీగా నగదు జమ కానుంది. దానికి కారణం.. ప్రభుత్వం నుంచి వాళ్లకు రానున్న 18 నెలల డీఏ బకాయిలు. డీఏ బకాయిలు త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జమ కానున్నట్టు తెలుస్తోంది. 18 నెలల బకాయిలు అంటే మాటలు కాదు.. సంవత్సరంనర బకాయిలు.. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.2 లక్షల వరకు అందనున్నట్టు తెలుస్తోంది. అంటే.. వచ్చే నెల జీతంతో పాటు డీఏ బకాయిలు మొత్తం రూ.2 లక్షలు ఒకసారి ఉద్యోగులకు అందనున్నాయి.
కరోనా వల్ల జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ(డియర్ నెస్ అలవెన్స్) ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించలేదు. దీనిపై చాలా సార్లు చర్చలు జరిగాయి. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకొని వాళ్ల అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేవల్ 1 ఉద్యోగులకే కనీసం రూ.11 వేల నుంచి రూ.37 వరకు అందే అవకాశం ఉంది. లేవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు కనీసం రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు పొందే అవకాశం ఉంది.
7th Pay Commission : లేవల్ 13, 14 ఉద్యోగులకు 2 లక్షల వరకు అందే అవకాశం
ఈ బకాయిల కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. పెన్షనర్లు కూడా బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా బకాయిలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకొస్తోంది. మరోవైపు ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో డీఏ బకాయిలపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. సంవత్సరానికి రెండు సార్లు డీఏను కేంద్రం పెంచుతుంది. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉంది. వచ్చే సంవత్సరం జనవరిలో మళ్లీ డీఏ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు 42 శాతం పెరిగే అవకాశం ఉంది.