7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన
7th Pay Commission : ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంచుతున్నట్టు ప్రకటించింది. డీఏ, డీఆర్ ను 4 శాతానికి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీపీసీ అంటే సెంట్రల్ పే కమిషన్ సిఫారసు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ 34 శాతంగా ఉంది. దాన్ని 38 శాతానికి పెంచనున్నారు.
జులై 1, 2022 నుంచి 34 శాతం డీఏను ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్నారు. తాజా పెంపుతో 38 శాతం డీఏ పెరగనుంది. ఈ ప్రకటన వల్ల 68 వేల రెగ్యులర్ ఉద్యోగులకు జీతం పెరగనుంది. ప్రభుత్వం మీద మరో రూ.120 కోట్ల భారం పడనుంది. అధికారికంగా ప్రభుత్వం కల్పించే క్వార్టర్స్ లేని వాళ్లకు జనవరి 1, 2023 నుంచి ప్రభుత్వం హెచ్ఆర్ఏను అందిస్తామని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖందు తెలిపారు.
7th Pay Commission : ఏడో సీపీసీ ప్రకారం ఎన్పీఏ చెల్లించనున్న ప్రభుత్వం
దీని వల్ల ప్రభుత్వం మీద మరో 42 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వ డాక్టర్లకు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్(ఎన్పీఏ)ను కూడా చెల్లిస్తామని తెలిపారు.ఏడో సీపీసీ ప్రకారం.. ప్రభుత్వ డాక్టర్లు అందరికీ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ను అందిస్తామని, ఈ సొసైటీకి డాక్టర్ల అవసరం ఎంతో ఉందని సీఎం అన్నారు. జనవరి 1, 2023 నుంచి ఎన్పీఏ చెల్లిస్తామని అన్నారు. దీని వల్ల రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ మీద భారం పడనుందని సీఎం తెలిపారు.