7th Pay Commission : దీపావళికి గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెరగనున్న డీఏ..!
7th Pay Commission : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్నిపెంచుతూ ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూలై నెల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ప్రకటించడంతో పాటు, మూడు నెలల బకాయిలును వెంటనే ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు డీఏ పెంపును ప్రకటించాయి. ఇక ఇప్పుడు పంజాబ్ టైం వచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి ముందు డీఏను పెంచనుందట.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే.. పంజాబ్ ప్రభుత్వం కూడా 4 శాతం డీఏను పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పంజాబ్ ఆర్థిక శాఖ 6 శాతం డీఏ ఆమోదం కోరుతూ ఫైల్‌ను సీఎంకు పంపిందని తెలుస్తుంది. సీఎం భగవంత్ మాన్ ఆమోదం తెలిపిన తర్వాత.. డీఏ పెంపుపై నేడు జరిగే మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపును పరిగణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు.. ఏదేమైనా త్వరలోనే డీఏ పెంపు ఎంతన్నది తేలనుంది. డీఏమరియు డీఆర్ రెండింటి ప్రభావం వలన ఖజానాపై సంవత్సరానికి 12,852.5 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో అన్నారు.
7th Pay Commission : ఎంత పెరగనుంది అంటే..
కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా పంజాబ్ ప్రభుత్వం దీపావళికి ముందు రాష్ట్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచడానికి సిద్ధంగా ఉంది. ఇంతకుముందు హర్యానా ప్రభుత్వం తమ రాష్ట్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. దాంతో హర్యానాలో ఉద్యోగుల డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు పెంచిన డీఏను అక్టోబరు నెల జీతంలో చెల్లిస్తామని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం.. జనవరి మరియు జూలైలలో డీఏ పెంచుతున్న విషయం మనందరికి తెలిసిందే.