7th Pay Commission : పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
7th Pay Commission : ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ఉద్యోగులకి వరుస కానుకలు అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పింఛనుదారులు, పదవీ విరమణ పొందిన వృద్ధులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సింగిల్ విండో పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పెరిగిన జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పింఛనుదారులు, పదవీ విరమణ పొందిన వృద్ధులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది.
పెన్షనర్లు వారి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి వ్యక్తిగతంగా వివిధ అధికారులను సంప్రదించకుండా ఒకే చోటు సమస్యను పరిష్కరించడానికి ఈ సింగిల్ విండో పోర్టల్ ని తీసుకు వచ్చారు. పింఛను బకాయిలను ప్రాసెస్ చేయడానికి, మంజూరు చేయడానికి లేదా పంపిణీ చేయడానికి వంటి వాటికి ఈ కొత్త పోర్టల్ ని లింక్ చేశామని అన్నారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను లేవనెత్తడం సహా.. వ్యక్తిగతంగా వివిధ అధికారులను సంప్రదించకుండా వాటిని పరిష్కరించేందుకు సింగిల్ విండో డిజిటల్ యంత్రాంగాన్ని రూపొందించడమే కామన్ పెన్షన్ పోర్టల్ లక్ష్యం.పదవీ విరమణ చేసిన ఉద్యోగుల విజ్ఞానం, అనుభవం, కృషిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా వుంది

7th pay commission will help to pensioners
7th Pay Commission : మంచి ఆప్షన్..
అని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా 100 నగరాల్లో లైఫ్ సర్టిఫికెట్ల సేకరణ కోసం డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయన్నారు.సింగిల్ విండో పోర్టల్.. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపే వెసులుబాటుతో పాటు పింఛనుదారుల సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది. తక్షణ ప్రతిస్పందన కోసం ఫిర్యాదులను కూడా క్రమం తప్పకుండా అంగీకరిస్తుంది. పింఛను బకాయిల ప్రాసెస్, మంజూరు, పంపిణీలో బాధ్యత వహించే అన్ని మంత్రిత్వ శాఖలు సింగిల్ విండో పోర్టల్ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి. ఆయా సమస్యల తీరును పరిశీలించిన తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదుల పరిష్కారం కోసం పంపుతారు. పింఛనుదారులు, అలాగే నోడల్ అధికారులు పెన్షనర్ల సమస్యలు సింగిల్ విండో సిస్టమ్‌లో పరిష్కారమయ్యే వరకు కంప్లయింట్ స్టేటస్ ను ఆన్‌లైన్‌లో చూడవచ్చు.