7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డీఏ పెంపు.. జులై జీతం ఎంత రానుందో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు జులైలో 9.3 శాతం డీఏ పెరగనుంది. 1 జులై 2022 నుంచి డీఏ పెంపు 9.3 శాతం పెరగనుంది. ఇప్పటికే డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఆర్డర్ జారీ చేసింది. డీఏ 9.3 శాతం పెరిగితే ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతం పెరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు రేటు 391 శాతంగా ఉంటుందని కేంద్రం వెల్లడించింది.
జులై 1 నుంచి ఎగ్జిక్యూటివ్స్, సీపీఎస్ఈ ఉద్యోగులకు 391 శాతం డీఏను పెంచనున్నారు. సీపీఎస్ఈ క్యాటగిరీలో ఎగ్జిక్యూటివ్స్, నాన్ యూనియన్ సూపర్ వైజర్స్ కు జులై 1 నుంచి 391 శాతం డియర్ నెస్ అలవెన్స్ ను అందించనున్నారు. 1997 రివైజ్ డ్ పే స్కేల్ ప్రకారం ఐడీఏ ఉద్యోగులకు 391 శాతం అందించనున్నారు.

9.3 percent increase in DA as per order by 7th pay commission
7th Pay Commission : జులై నెల జీతం ఎంత రానుంది?
ఇవన్నీ జులై 1, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. సాధారణంగా డీఏ పెంపు ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో జరుగుతుంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెంపును కేంద్రం నిర్ణయిస్తుంది. జనవరికి సంబంధించిన డీఏను మార్చిలో పెంచింది కేంద్రం. జులైలో పెరగాల్సిన డీఏను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. జులై నెల జీతం.. ఆగస్టులో డీఏ పెంపు కలిపి రానుంది.