Relation : మగాళ్లపై ఓ సర్వే చెప్పిన సంచలన విషయాలు .. 60 శాతం మందికి వివాహేతర సంబంధాలు ఇష్టమట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Relation : మగాళ్లపై ఓ సర్వే చెప్పిన సంచలన విషయాలు .. 60 శాతం మందికి వివాహేతర సంబంధాలు ఇష్టమట..!

Relation : ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి అయి అనుకూలమైన భాగస్వామిని పొందినా సరే పక్క చూపులు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక సమాజంలో చోటు చేసుకుంటున్న చాలా నేరాలకు వివాహేతర సంబంధాలే కారణం. పెళ్లయి పిల్లలున్న సరే పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎందరో ఉన్నారు. దీనివల్ల వారి జీవితాలు నాశనం కావడం మాత్రమే కాకుండా చిన్నారుల జీవితాలు కూడా బలవుతున్నాయి. పసివాళ్ళ బాల్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా […]

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,11:00 am

Relation : ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి అయి అనుకూలమైన భాగస్వామిని పొందినా సరే పక్క చూపులు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక సమాజంలో చోటు చేసుకుంటున్న చాలా నేరాలకు వివాహేతర సంబంధాలే కారణం. పెళ్లయి పిల్లలున్న సరే పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎందరో ఉన్నారు. దీనివల్ల వారి జీవితాలు నాశనం కావడం మాత్రమే కాకుండా చిన్నారుల జీవితాలు కూడా బలవుతున్నాయి. పసివాళ్ళ బాల్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో సగానికి పైగా పెళ్లయిన మగాళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ డేటింగ్ యాప్ గ్లీడెన్ వెల్లడించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

భారతీయులు వివాహేతర సంబంధాలతో చాలా ఆసక్తి ఉండటమే కాక త్వరగా వాటిపట్ల ఆకర్షితులవుతున్నారని సర్వే తెలిపింది. సుమారు 60 శాతం మందికి పైగా మగవాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. నివేదికలో టైర్ 1, టైర్ 2 సిటీలో నివసించే 1503 మంది నుంచి ఈ సమాచారాన్ని సేకరించి యాప్ పరిశోధకులు అంచనా వేశారు. వీరిలో 25 ఏళ్ల నుంచి 50 లోపు వయసు కలిగిన మగవాళ్లను ప్రశ్నించినట్లు తెలుస్తోంది కొన్నేళ్లుగా వివాహ బంధం పై భారతీయులు ఆలోచనలు మారుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న చాలామంది వృత్తి, ఆర్థిక, ఇతర బయట ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు, సరికొత్త అనుభూతులను పొందేందుకు వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది.

ఆధునిక భారతదేశంలో మారుతున్న సంబంధాల గురించి తెలియజేస్తు సర్వేలో పాల్గొన్న వారిలో 46% మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారితో వివాహేతర సంబంధాలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 36% మంది మహిళలు 35 శాతం మంది పురుషులు వర్చువల్ విధానంలో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఏది ఏమైనా ఈ వివాహేతర సంబంధా లు మానవ జీవితంలో పెద్దముప్పుగా మారాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను మంచి కంటే చెడుగానే ఎక్కువగా వినియోగిస్తున్నారు దీని వలన కుటుంబాలు నాశనం అవ్వడం తప్ప మరేమీ ఉండదు. మరీ ముఖ్యంగా అభంశుభం తెలియని పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది