Good News : కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్, పాన్, పాస్‌పోర్టు వీటిన్నింటికీ ఒకే కార్డు!
Good News : భారత పౌరులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకమీదట అన్ని ఐడీలను ఒకే కార్డు రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. దీంతో చాలా మంది కార్డులన్నింటినీ వ్యాలెట్‌లో మెయింటెన్ చేయాల్సిన పని తప్పిందని చెప్పుకోవచ్చు. దేశంలో మనకు ప్రపథమంగా ఆధార్ కార్డు అన్నింటికంటే చాలా ప్రధానం.. సంక్షేమ పథకాలు మొదలుకుని సిటిజన్ ఫ్రూఫ్ కోసం ఇది తప్పనిసరి. ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ, ఆదాయ ధృవీకరణ, పన్నుల కోసం పాన్ కార్డు, విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్టు ఇవన్నీ సగటు భారత పౌరుడు కలిగి ఉంటాడు.
సాధారణంగా ఓ వ్యక్తి ప్రభుత్వ ఆఫీసుకు ఏదైనా పనిమీద వెళ్లాడునుకోండి. చాలా దూరం నుంచి వచ్చాడు. ఆటైంలో ఏదైనా ఆధార్ లేదా పాన్ మర్చిపోయినా వారు మరుసటి రోజు రావాలని చెబుతారు. దీంతో అతని పని ఆగిపోతుంది. వందల కిలోమీటర్లు మళ్లీ జర్నీ చేయాలి లేదా స్థానికంగా ఎక్కడైనా బస చేస్తే అందుకు మళ్లీ ఖర్చులు తప్పవు. లేదా డ్యాక్యుమెంట్ లేకుండా మేనేజ్ చేయాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిందే.అంతేకాకుండా పాస్ పోర్టు మినహా ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వ్యాలెట్‌లో పెట్టుకుని
Good News : అన్ని ఒకే కార్డులో ఉంటే లాభమా?
ట్రావెల్ చేసే టైంలో మిస్ అయ్యిందనుకోండి? అప్పుడు ఒక్కోక్కటి సెపరేట్‌గా దరఖాస్తు చేసుకోవాలి. దీని వలన టైంతో పాటు డబ్బులు కూడా వృథా అవుతాయి. అందుకే అన్ని ఒకే కార్డు రూపంలో తెస్తే ఎక్కడైనా పోయినా, ఏదైనా కార్డు మర్చిపోయి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లినా పెద్దగా నష్టం ఉండదు. కొత్తగా తీసుకొచ్చే కార్డుకు ఫెడరేటెడ్ డిజిటల్ ఐటెండిటీస్ కార్డు వ్యవహరిస్తారట.. మన భాషలో చెప్పాలంటే ఎఫ్‌డీఐ.. ఇది వచ్చిందంటే చాలా మందికి పర్సు నిండా కార్డులు పెట్టుకుని తిరిగే గోల తప్పనుంది.