Aakash puri : ఆకాష్ పూరి హీరోగా మూడవ చిత్రం.. హీరోయిన్ గా కృతిశెట్టి..?

Authored By vamana sai | The Telugu News | Updated on : 27 January 2021, 5:00 pm

Aakash puri :  ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కథ మాటలతో ఆయన అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఆకాష్ రొమాంటిక్ సినిమా తెరకెక్కింది. పూరి మార్క్ లవ్ అండ్ రొమాన్స్ తో పాటు మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఈ క్రమంలో త్వరలో రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట చిత్ర యూనిట్. అంతేకాదు ఈ ‘రొమాంటిక్’ ఎంటర్‌టైనర్ ని రొమాంటిక్ డే అయిన ఫిబ్రవరి 14 న రిలీజ్ చేసేందుకు పూరి టీం ప్లాన్ చేస్తున్నారట.

aakash puri's third movie as a hero krithishetti as a heroine

aakash puri’s third movie as a hero krithishetti as a heroine

కాగా పూరి కనెక్ట్స్ – పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేయడం తో ఆకాష్ పూరి మూడవ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఆకాష్ పూరి డెబ్యూ సినిమా మెహబూబా సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఇక రెండవ సినిమా రొమాంటిక్ కి కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

Aakash puri : మరోసారి కొత్త దర్శకుడితో ఆకాష్ పూరి.. !

aakash puri's third movie as a hero krithishetti as a heroine

aakash puri’s third movie as a hero krithishetti as a heroine

ఈ క్రమంలోనే మూడవ సినిమాకి పూరి దగ్గర అసోసియేట్ గా చేస్తున్న మరో కొత్త కుర్రాడిని పూరి దర్శకుడిగా మార్చబోతున్నాడట. అతని దర్శకత్వంలో ఆకాష్ మూడవ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఆకాష్ కి జంటగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతిశెట్టి ని హీరోయిన్ గా తీసుకోవాలని పూరి టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. ఇప్పటికే కృతి శెట్టి నాని తో ఒక సినిమా సుధీర్ బాబు తో ఒక సినిమా చేస్తోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp