వివేకా హత్య కేసులో ఆయన వద్ద సాక్ష్యాలున్నాయట.. ఇంతకు హత్య చేసింది ఎవరు?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసు విచారణ స్పీడ్ గా జరుగుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కేసు విషయంలో ఏమాత్రం ముందడుగు లేదు. దీంతో వివేకానంద రెడ్డి కూతురు తన తండ్రి మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ త్వరిత గతిన జరగడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను కేసు తెమల్చాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
vivekananda reddy : వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..
ఇంటిలిజెన్స్ మాజీ అధికారి అయిన వెంకటేశ్వరరావు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తన వద్ద కీలక ఆధారాలు ఉన్నాయంటూ ఆయన బాంబు పేల్చాడు. ఇందులో ఉన్న దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనే విషయాలకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉంది అంటూ ఆయన ప్రకటించాడు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన విచారణ జరుపుతున్న విచారణ అధికారులకు ఆయన సాక్ష్యాలను ఇచ్చేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు.

AB venkateshwara rao comments on vivekananda reddy murder case
vivekananda reddy : హత్యను ప్రమాదంగా..
వివేకానంద రెడ్డి హత్య కేసును నీరుగార్చేందుకు కొందరు ప్రయత్నించారనే ఆరోపణలు ఆయన చేస్తున్నాడు. మీడియాలో ఈ హత్య కు సంబంధించిన కథనాలు ఎక్కవగా వస్తున్న నేపథ్యంలో విచారణ అధికారులు చేస్తున్న విచారణ పై క్లారిటీ రావడం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పెద్ద తలకాయలే ఉన్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలిజెన్స్ మాజీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ కేసును త్వరగా పూర్తి చేయాలంటూ కోర్టుకు లేఖ రాయడం జరిగింది. ఈ కేసు విచారణలో తాను కోర్టుకు హాజరు అయ్యేందుకు కూడా సిద్దం అంటూ ఆయన ప్రకటించాడు. ఇంతకు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు అనే విషయంలో మాత్రం ఆయన స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు.