తిరుపతి రిజల్ట్ తర్వాత ఆ ఇద్దరు ఔట్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

తిరుపతి రిజల్ట్ తర్వాత ఆ ఇద్దరు ఔట్‌..!

 Authored By himanshi | The Telugu News | Updated on :19 April 2021,8:59 pm

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తిరుపతి ఉప ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం ఖాయం అంటూ ఎగ్జిట్ పోల్స్ నుండి మొదలుకుని రాజకీయ విశ్లేషకుల వరకు అంతా అంటున్నారు. ఖచ్చితంగా వైకాపా విజయం సాధించడం ఖాయం కాని మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందంటూ అధికార పార్టీ లెక్కలు వేసుకుంటూ ఉంది. తెలుగు దేశం మరియు బీజేపీలు మాత్రం ఏదైనా అద్బుతం జరుగక పోతుందా అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం మరియు బీజేపీల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు కూడా తప్పుకోవాల్సి రావచ్చు అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

Acham Naidu : ఓటమికి బాధ్యత వహిస్తూ…

తెలుగు దేశం పార్టీ కీలక పదవిలో ఉన్న అచ్చెం నాయుడు ఇటీవల మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు తోడు తిరుపతి ఉప ఎన్నిక ఓటమికి బాధ్యుడిగా చేస్తూ తొలగించే అవకాశం ఉంది. మర్యాదపూర్వకంగా ఆయన తొలగితే పర్వాలేదు. లేదంటే ఆయన్ను బలవంతంగా అయినా తప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి ఏపీ లో టీడీపీకి కొత్త నేత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ కూడా సోము వీర్రాజు ను పక్కకు పెట్టే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.

Somu Veeraju : బీజేపీ నాయకత్వం అసంతృప్తి…

తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు ఇచ్చినా కూడా రాష్ట్ర నాయకత్వం సరిగ్గా ఉపయోగించుకోలేదు అంటూ బీజేపీ అధినాయతక్వం అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా సోము వీర్రాజు అందరిని కలుపుకు పోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు అంటూ వారు భావిస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ మాదిరిగా అగ్రెసివ్‌ గా ఆయన ఉండలేక పోతున్నారు. అందుకే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ను ఎంపిక చేసి వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్దం చేయాలని అధినాయకత్వం భావిస్తుంది. బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మరి కొంత కాలం సోము వీర్రాజు ఆ పదవిలో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుంది అనేది తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలను బట్టి తేలే అవకాశం ఉంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది