adilabad district kannepalli village developed
Adilabad : ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలంలో ఉన్న కన్నెపల్లి అనే గ్రామం అభివృద్ధిలో తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ గ్రామం రెండు సార్లు ఏకగ్రీవ పంచాయతీగా గుర్తింపు పొందింది. ఈ ఊళ్లో ప్రతి ఇంట్లో ఒక మరుగు దొడ్డి, ఇంకుడుగుంత ఉన్నాయి. అలాగే.. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉన్నాయి.
adilabad district kannepalli village developed
ప్రతి వాడలోనూ సీసీ రోడ్లు, మురుగు కాలవలను కూడా తవ్వారు. ప్రతి రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించి.. డంప్ యార్డ్ కు తరలిస్తున్నారు. గ్రామంలో వైకుంఠధామం కూడా పూర్తయింది.పల్లె ప్రకృతి వనం, ఇతర పనులన్నీ ఈ గ్రామంలో పూర్తయ్యాయి. అందుకే ఈ గ్రామం నూటికి నూరు శాతం అభివృద్ధి చెందిన గ్రామంగా చరిత్రకెక్కింది.
ఓవైపు పచ్చదనం మరోవైపు గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. కన్నెపల్లి గ్రామ జనాబా 1500 కాగా.. అక్కడ వార్డుల సంఖ్య 10. అలాగే గ్రామంలో ఉండే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. అవి కూడా పెద్దగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.