Layoffs | ప్రపంచాన్ని ఊపేస్తున్న AI ప్రభావం.. ఉద్యోగాల్లో విప్లవాత్మక మార్పులు
Layoffs | గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల్లో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్, అమెజాన్, ఇంటెల్ వంటి టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.
#image_title
AI తో ఉద్యోగ రంగం మారిపోతోంది
అమెరికాలోని ఆర్కాన్సాస్ రాష్ట్రం, బెంట్న్‌విల్లేలో నిర్వహించిన వర్క్‌ఫోర్స్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన డగ్ మెక్‌మిలన్, “AI ప్రభావం ప్రతి ఉద్యోగం మీద కనిపించనుంది. ఇవాళ మనం చూసే అనేక రకాల ఉద్యోగాలు రేపు భిన్నంగా మారిపోతాయి. కొన్ని ఉద్యోగాలు పూర్తిగా తొలగిపోతే, మరికొన్నింటి పని తీరులో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి. AI ప్రభావం అంచనాలకు మించి ఉంటుంది. కంపెనీలు, ఉద్యోగులు అందుకు సిద్ధంగా ఉండాలి,” అంటూ హెచ్చరించారు.
ప్రస్తుతం వాల్‌మార్ట్‌లో 2.1 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ ప్రకారం ఈ సంఖ్య వచ్చే మూడేళ్లలో ఎక్కువగానీ, తక్కువగానీ ఉండకపోవచ్చు. కానీ ఉద్యోగాలు చేసే విధానాల్లో మాత్రం మార్పులు తప్పవని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది. వేర్‌హౌస్ ఆటోమేషన్, AI ఆధారిత చాట్‌బాట్‌లు, బ్యాక్‌స్టోర్ మేనేజ్‌మెంట్ వంటివాటిలో ఇప్పటికే అనేక ఉద్యోగాలను తొలగించారు. ఇక స్టాకింగ్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాలు కూడా మారుతున్నాయి.