జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ దెబ్బకి, ఆ ఆ పార్టీ అధినేతకి నిద్ర కూడా పట్టట్లేదు..!
ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా. షార్ట్ కట్ లో పీకే అంటారు. ఆయన ఎన్నికల వ్యూహకర్త. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించింది ఈయనే. టీడీపీ పార్టీ అయితే ఈయన మీద చేయని ఆరోపణలు లేవు. ప్రస్తుతం టీడీపీ కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ కు చెందిన మరో వ్యక్తిని తమ పార్టీకి పొలిటికల్ వ్యూహకర్తగా నియమించుకుంది. అది వేరే విషయం.
అయితే.. ఈ సారి ప్రశాంత్ కిషోర్.. ఇంకో పార్టీకి తలనొప్పిగా మారాడట. ఆ పార్టీ మన ఏపీది కాదు లేండి. పక్క రాష్ట్రం తమిళనాడుది. అవును.. అన్నాడీఎంకే పార్టీ అయితే.. ప్రశాంత్ కిషోర్ అంటేనే ఎగిరెగిరిపడుతోంది. ఎందుకో మరి.
ప్రశాంత్ కిషోర్ కు చెందిన కంపెనీ ఐప్యాక్.. ప్రస్తుతం డీఎంకే పార్టీకి రాజకీయ సేవలను అందిస్తోంది. ఏపీలో వైసీపీ గెలుపులో పీకే పాత్ర కూడా ఉండటంతో వెంటనే డీఎంకే పార్టీ ప్రశాంత్ ను తమ పార్టీకి వ్యూహకర్తగా నియమించుకుంది.
ఇది.. అన్నాడీఎంకే పార్టీకి గిట్టడం లేదు. డీఎంకే పార్టీకి చీఫ్ స్టాలినా లేక ప్రశాంత్ కిషోరా? ప్రశాంత్ కిషోరే డీఎంకేకు బాస్ లా వ్యవహరిస్తున్నారే అంటూ విమర్శలు చేసింది.
త్వరలో తమిళనాడులోనూ ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో గతంలో ఏపీలో ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలు వైసీపీ కోసం పనిచేసిన పీకే టీమ్ పై ఇలాగే విరుచుకుపడ్డారు. ఇప్పుడు సేమ్ టు సేమ్.. తమిళనాడులో అదే సీన్ రిపీట్ అవుతోంది. అప్పుడు టీడీపీ.. ఇప్పుడు అన్నాడీఎంకే.. ఏమాత్రం తేడా లేదు.. అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంత్ ఒక బీహార్ గ్యాంగ్
అంతే కాదు.. ప్రశాంత్ కిషోర్ ఒక బీహార్ గ్యాంగ్ అని.. జగన్ బీహార్ నుంచి ఈ గ్యాంగ్ ను పట్టుకొచ్చి.. పార్టీ కోసం పనిచేయించుకుంటున్నారంటూ టీడీపీ అప్పట్లో ఆరోపణలు చేసింది. తర్వాత ఆ బీహార్ గ్యాంగ్ లోని వ్యక్తినే టీడీపీ వ్యూహకర్తగా నియమించుకుంది. మరి.. అన్నాడీఎంకే కూడా అలాగే పీకే టీమ్ ను ఎన్నికల కోసం ఆశ్రయిస్తుందా? లేక వేరే టీమ్ ను సెట్ చేసుకుంటుందా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.