Akhilesh Yadav : శ్రీకృష్ణుడు నా కలలోకొచ్చాడు.. వచ్చే ఎన్నికల్లో నన్నే గెలిపిస్తాడు’.. వైరలవుతోన్న అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు..!
ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లార్డ్
శ్రీ కృష్ణ ప్రతిరోజు తన కలలోకి వచ్చి తనతో సంభాషిస్తాడని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ఉత్తర్ ప్రదేశ్లో త్వరలోనే రామరాజ్యం ఏర్పాటు చేస్తామంటూ అందుకు తనకు శ్రీ కృష్ణ భగవానుడి నుంచి ఆశిస్సులు లభించాయని అఖిలేశ్ చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని స్వయంగా శ్రీకృష్ణుడే తనకు చెబుతుంటారని అన్నారు.
రాష్ట్రంలో భాజపా సర్కారు పూర్తిగా విఫలమైందన్న అఖిలేష్… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము భారీ విజయం సాధిస్తామని ఆశాభవం వ్యక్తం చేశారు. భాజపా ఎమ్మెల్యే మాధురి వర్మను తమ పార్టీలోకి ఆహ్వానించే సందర్భంగా అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇందుకు సంభదించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అఖిలేష్ పోస్ట్ పై నెటిజ్లనంతా హాస్యాస్పదమైన కామెంట్లు పెడుతూ అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టారు.

Akhilesh Yadav comments on lord shri Krishna on up elections
అఖిలేష్ యాదవ్ ఫోటోలతో మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఫిబ్రవరి నెల చివరిలో ఎన్నికలు జరుగనున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఈసారి రసవత్తరంగా జరగనుంది.