Alert : హైదరాబాద్ లో ఏం జరుగుతుంది…? అలెర్ట్ అయిన నిఘా వర్గాలు, పోలీసులు…!
Alert : హైదరాబాద్ లో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆందోళన మరోసారి మొదలయింది. నిన్న జరిగిన ఒక దాడి దెబ్బకు హైదరాబాద్ పాతబస్తీ ప్రజల్లో, పోలీసుల్లో కంగారు మొదలయింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ కాల్పుల దెబ్బకు ఆయన ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలీసులు జాగ్రత్త పడ్డారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లీం ప్రభావిత ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక నిఘా వర్గాలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అని అన్ని అంశాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. హైదరాబాద్ లోనీ పాతబస్తీ ప్రాంతాల్లో అలెర్ట్ అయిన పోలీసులు నిఘా కట్టుదిట్టం చేసారు. మఫ్టీలో కొందరు పోలీసులు పాతబస్తీలో తిరుగుతున్నారు.ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటచేసుకోకుండా పోలీస్ బలగాలను భారీగా మొహరించారు
. పాతబస్తీ, చార్మినార్, మక్క మసీద్ తదితర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేసారు. అందుబాటులో క్విక్ రియాక్షన్ టీమ్ & రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ తో బందోబస్తు ఏర్పాటు చేసారు. నేడు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గస్తీని పెంచారు.