Apple : యాపిల్ యూజర్లకు అలర్ట్…వెంటనే ఈ పని చేయండి… లేదంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Apple : యాపిల్ యూజర్లకు అలర్ట్…వెంటనే ఈ పని చేయండి… లేదంటే…!

Apple : యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్న వినియోగదారులను కంపెనీ అలర్ట్ చేసింది. తమ ఉత్పత్తులలోని సాఫ్ట్ వేర్ లలో లోపాన్ని గుర్తించినట్లు ఆపిల్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ కు సంబంధించిన కొన్ని ఉత్పత్తులలో ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్లో కొన్ని లోపాలను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని ఆసరాగా తీసుకుని హ్యాకర్లు డివైసులను తమ కంట్రోల్లోకి తీసుకుని అవకాశం ఉందని అంటున్నారు. అందువలన వెంటనే సాఫ్ట్ వేర్లను అప్ డేట్ చేసుకోవాలని యూజర్లను సూచించింది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2022,7:20 pm

Apple : యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్న వినియోగదారులను కంపెనీ అలర్ట్ చేసింది. తమ ఉత్పత్తులలోని సాఫ్ట్ వేర్ లలో లోపాన్ని గుర్తించినట్లు ఆపిల్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ కు సంబంధించిన కొన్ని ఉత్పత్తులలో ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్లో కొన్ని లోపాలను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని ఆసరాగా తీసుకుని హ్యాకర్లు డివైసులను తమ కంట్రోల్లోకి తీసుకుని అవకాశం ఉందని అంటున్నారు. అందువలన వెంటనే సాఫ్ట్ వేర్లను అప్ డేట్ చేసుకోవాలని యూజర్లను సూచించింది. అయితే యూజర్లను సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ క్రింది విధంగా తెలిపింది.

ఐఫోన్ 6ఎస్ తర్వాత మోడల్స్ ఐపాడ్ ఫిఫ్త్ జనరేషన్ ఆ తర్వాత మోడల్స్ తో పాటు ఐపాడ్ లోను ఈ సాఫ్ట్ వేర్ లోపాన్ని గుర్తించారు. అలాగే కొన్ని మ్యాక్ కంప్యూటర్లలోని సాఫ్ట్ వేర్ లోపాలను గుర్తించారు. ఈ ఉత్పత్తులను వారుతున్న వారందరూ వెంటనే సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసుకోవాలని ఆపిల్ కంపెనీ సూచించింది. అయితే ఈ టెక్నికల్ లోపాన్ని అదునుగా తీసుకొని ఇప్పటివరకు ఏమైనా దాడులు జరిగాయా అంటే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కంపెనీ. సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.

Alert the Apple users to update the software

Alert the Apple users to update the software

ఆపిల్ వినియోగదారులు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ సెక్షన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే డౌన్లోడ్ అండ్ ఇన్ స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సాఫ్ట్ వేర్ అప్డేట్ అవుతుంది. ఈ లోపాలను అదునుగా చేసుకొని హ్యాకర్లు డివైజ్ లను తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత డేటా తో పాటు బ్యాంక్ అకౌంట్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి యాపిల్ యూజర్లు వెంటనే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవడం మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది