Fruits | పండ్లతో పాటు తొక్కలు తినడం వల్ల లాభాలేంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fruits | పండ్లతో పాటు తొక్కలు తినడం వల్ల లాభాలేంటో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :7 November 2025,4:37 pm

Fruits | పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే పండ్లతో పాటు వాటి తొక్కలు తినడం వల్ల శరీరానికి మరింత ప్రయోజనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పండ్లు తినే ముందు తొక్కలు తీసేస్తారు. కానీ తొక్కల్లోనే ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

#image_title

యాపిల్ తొక్కల అద్భుత గుణాలు

రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని అందరూ చెబుతుంటారు. అయితే యాపిల్ తొక్కలో కూడా అంతే ఆరోగ్యకరమైన గుణాలు దాగి ఉన్నాయి. ఈ తొక్కల్లో పీచు పదార్థం, విటమిన్‌ సి మెండుగా ఉండి, ఆకలిని తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. అదనంగా, యాపిల్ తొక్కల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

యాపిల్ తొక్కలు అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ తొక్కల్లో ఉన్న కొల్లాజెన్ ఉత్పత్తి వలన చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి, చర్మం సాఫ్ట్‌గా, యంగ్ లుక్‌లో కనిపించేలా చేస్తాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది