Ali : వైఎస్ జగన్ తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, అందుకే కలిసా ఆలీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ali : వైఎస్ జగన్ తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, అందుకే కలిసా ఆలీ

 Authored By venkat | The Telugu News | Updated on :15 February 2022,6:55 pm

Ali : సిఎం వైఎస్ జగన్ తో భేటీ అనంతరం సినీ నటుడు ఆలీ మీడియాతో మాట్లాడారు. చిరంజీవి తో పాటు మమ్మల్ని కూడా పిలిచారు అని నిన్న సాయంత్ర సీఎం ఆఫీస్ నుండి కాల్ చేశారు అన్నారు. అతి త్వరలో పార్టీ ఆఫీస్ నుండి అనౌన్స్ మెంట్ వస్తుంది అన్నారు.  నేను కాన్వాస్ చేసిన ఎం ఎల్ ఏ లు, మంత్రులను ఇప్పుడు కలిశాను అన్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి తో కూడా పరిచయం ఉంది అని గుర్తు చేసుకున్నారు.

నా పెళ్లి రోజు సీఎం జగన్ ను కలుద్దాం అనుకున్నాం కుదరలేదు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ తో వచ్చాను అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయమని నాకు ఆఫర్ చేశారు అని ఒక ఎం ఎల్ ఏ గా గెలవాలంటే చాలా కావాలి అందుకే వద్దన్నా అని చెప్పుకొచ్చారు. చిరంజీవి బృందాన్ని పిలిచి అవమాన పరచడం ఏమి లేదు అని ఆయన స్పష్టం చేసారు.

ali meets wit Ys jagan

ali meets wit Ys jagan

మొదటి సారి చిరంజీవి ఒక్కరే వచ్చినప్పుడు సీఎం వచ్చి తీసుకెళ్లారు అని గుర్తు చేసారు. సినిమా కష్టాలు చెప్పుకున్నము త్వరలోనే వాటికి పరిస్కరం లభిస్తుంది అని భావిస్తున్నాం అన్నారు. సినిమా టికెట్ ల వ్యవహారం లో తప్పక త్వరలో పరిష్కారం వస్తుంది అని పేర్కొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

venkat

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది