
Pawan Kalyan : రాజకీయాలు మిత్రులని శత్రువులుగా మార్చడం, ఫ్రెండ్స్ ని విరోధులుగా మార్చడం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్, ఆలీకి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మనందరికి తెలిసిందే. రాజకీయాలలోకి వచ్చాక వారిద్దరి మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కమెడియన్ అలీని తన సినిమాల్లో ఉండనిచ్చే విధంగా దర్శకులతో మాట్లాడేవాడు. చాలా కాలం పాటు వీరి మధ్య మంచి స్నేహం కొనసాగింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వీరీ కాంబినేషన్స్ కు అయితే మంచి గుర్తింపు వచ్చింది. సవాల్‌కి సిద్ధం..
రాజకీయపరంగా వీరికి తీవ్రస్థాయిలో విభేదాలు రావడం చూసి అందరు ఆశ్చర్యపోయారు. అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ విని అందరు అవాక్కయ్యారు . ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆలీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చిన ప్రయత్నం చేయగా, అప్పటి నుండి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా ఆలీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని తిరుపతిలో చెప్పుకొచ్చారు.
ali says ready to fight elections on pawan kalyan
జగన్ ఆదేశాల ప్రకారం ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ గా ఉన్నానని, . పవన్ కల్యాణ్ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు రెండు వేరని ఆలీ చెప్పారు. ఆలీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కొనసాగుతుండగా, రెగ్యులర్ రాజకీయాల్లో బిజీ అయ్యేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే అప్పుడప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో కూడా పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.