Allu Arjun Biggest Cutout : మెగా కాదు ఏ హీరోకి లేని రికార్డ్.. 108 అడుగులతో పుష్ప రాజ్.. ఇది కదా క్రేజ్ అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun Biggest Cutout : మెగా కాదు ఏ హీరోకి లేని రికార్డ్.. 108 అడుగులతో పుష్ప రాజ్.. ఇది కదా క్రేజ్ అంటే..!

Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి నేషనల్ లెవెల్ లో బాక్సాఫీస్ రికార్డులపై కన్నేశాడు. పుష్ప 1 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తక్కువ ప్రమోషన్స్ తో రిలీజ్ చేశారు. కానీ పుష్ప 2 ని మాత్రం అలా కాకుండా భారీగా ప్ర్మఓట్ చేస్తున్నారు. మొన్న పాట్నాలో నిన్న చెన్నైలో ఈవెంట్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమాపై ఉన్న బజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఐతే పాన్ ఇండియా హీరోలు చాలామంది ఉన్నా కూడా పుష్ప 2 తో అల్లు అర్జున్ ఎన్నో రికార్డులను నెలకొల్పేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 కోసం అల్లు అర్జున్ కి 108 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ రేంజ్ లో మెగా హీరోదే కాదు ఏ పాన్ ఇండియా హీరోకి పెట్టలేదు. వైజాగ్ లో అల్లు ఫ్యాన్స్ అల్లు అర్జున్ కోసం 108 అడుగుల కటౌట్ సిద్ధం చేశారు.

Allu Arjun Biggest Cutout : మెగా కాదు ఏ హీరోకి లేని రికార్డ్.. 108 అడుగులతో పుష్ప రాజ్.. ఇది కదా క్రేజ్ అంటే..!

Allu Arjun Biggest Cutout : మెగా కాదు ఏ హీరోకి లేని రికార్డ్.. 108 అడుగులతో పుష్ప రాజ్.. ఇది కదా క్రేజ్ అంటే..!

Allu Arjun Biggest Cutout సంగం థియేటర్ దగ్గర..

ఈ కటౌటు ని వైజాగ్ సంగం థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోలు కూడా ఎవరికీ ఈ రేంజ్ కటౌట్ పెట్టలేదు. 108 అడుగుల కటౌట్ తో అల్లు అర్జున్ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. పుష్ప రాజ్ పాత్రతో ఆడియన్స్ కు దగ్గరైన అల్లు అర్జున్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ రికార్డులను కొట్టేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి రష్మిక మందన్న స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. శ్రీలీల కూడా స్పెషల్ సాంగ్ లో నటించింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 5న భారీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది పుష్ప 2. Allu Arjun, Pushpa 2 , Allu Arjun Cutout, Sangam Theater, Sukumar

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి