Pushpa 2 Kissik Song : కిస్సిక్ సాంగ్ ఎలా ఉంది.. పాట గురించి నెటిజన్స్ ఏమంటున్నారు..!
ప్రధానాంశాలు:
Pushpa 2 Kissik Song : కిస్సిక్ సాంగ్ ఎలా ఉంది.. పాట గురించి నెటిజన్స్ ఏమంటున్నారు..!
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2 చిత్రం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న క్రమంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇక చిత్రం నుండి ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ వస్తున్నారు. పుష్ప2లో కిస్సిక్ అనే ఓ ప్రత్యేక గీతం పెట్టారు. ఈ పాట కోసం డాన్సింగ్ క్వీన్ శ్రీలీల డ్యాన్స్ చేయడం మరో విశేషం. ఎంతగానో ఎదురుచూసిన ‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ బయటికి వచ్చింది. ”రేయ్ అందరూ వచ్చి ఉండారు గాని పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అని’ అంటూ సుకుమార్ వాయిస్ ఓవర్ తో ఈ పాట మొదలైంది. ఫోటో థీమ్ చుట్టూ నడిచిన సాంగ్ ఇది. కథలో సందర్భం ఏమిటో కానీ ఫోటో చుట్టూ ఈ సాహిత్యం సాగింది.
Pushpa 2 Kissik Song బీట్ చేస్తుందా..
దేవిశ్రీప్రసాద్ మాస్ క్యాచి ట్యూన్ చేయడం మరోసారి తన మార్క్ చూపించారు. వినగానే కనెక్ట్ అయ్యే ట్యూన్ ఇది. దెబ్బలుపడతాయి రాజా అనే హుక్ ఫ్రేజ్ వైరల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. లిరికల్ వీడియోలో డ్యాన్స్ మూమెంట్స్ పెద్దగా చూపించలేదు. పుష్ప రాజ్ స్టయిల్ లో వేసిన ఓ మాస్ స్టెప్ వుంది. శ్రీలీల తన గ్రేస్ చూపించింది. ఇదొక పార్టీ సాంగ్. థియేటర్ లో ఈ సాంగ్ ఓ రేంజ్ లో పేలడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ ఊ అంటావా పాటని రీప్లేస్ చేస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలో క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాటకి అనుకున్న స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఊ అంటావా సినిమాతో పోల్చి చూస్తే ఒక మోస్తరుగానే ఉందనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వస్తోంది, చంద్రబోస్ సాహిత్యం కూడా అంచనాలని అందుకోలేకపోయిందని టాక్ నడుస్తుంది.
శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ ఊ అంటావా పాటని రీప్లేస్ చేస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలో క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాటకి అనుకున్న స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఊ అంటావా సినిమాతో పోల్చి చూస్తే ఒక మోస్తరుగానే ఉందనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వస్తోంది, చంద్రబోస్ సాహిత్యం కూడా అంచనాలని అందుకోలేకపోయిందని కామెంట్స్ వస్తున్నాయి.పుష్ప 2 సినిమా కథ మొత్తం 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కానీ కిస్సిక్ పాటలోనే పదాలు మాత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చాలా పదాలు పాటలో వినిపించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తోన్నారు.