Amaravathi : అమరావతి పాదయాత్రలో భారీ ట్విస్ట్ – జగన్ చెప్పిందే జరిగింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amaravathi : అమరావతి పాదయాత్రలో భారీ ట్విస్ట్ – జగన్ చెప్పిందే జరిగింది

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 October 2022,7:00 am

Amaravathi : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండేళ్ల లోపు అమరావతి రాజధాని కోసం అన్ని ప్రాంతాల మద్దతును కూడగట్టాలని అమరావతి రైతులు భావిస్తున్నారు. అందుకే అన్ని ప్రాంతాల మద్దతును కోరేందుకు రాజధాని అమరావతి రైతులు.. మహాపాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే వాళ్లు మహా పాదయాత్రను ప్రారంభించి చాలా రోజులు అవుతుంది. నెల రోజులు కావస్తోంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అమరావతి పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఒక్క గుడివాడలోనే పాదయాత్రలో కొన్ని సమస్యలు వచ్చాయి. చాలా జిల్లాల్లో అమరావతి రైతులకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ నాయకులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను పెద్దగా పట్టించుకోలేదు.

కానీ.. రాజధాని రైతుల ఉద్యమం మహా ఉద్యమంగా మారుతోంది. మహా పాదయాత్రకు జనాలు తోడవుతున్నారు.ఇక.. అమరావతి నుంచి అరసవిల్లికి మహా పాదయాత్రను అమరావతి రైతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రూట్ లో గోదావరి జిల్లాల వరకు ఎలాంటి సమస్య లేదు కానీ.. విశాఖ జిల్లాకు పాదయాత్ర ఎంటర్ అవగానే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైజాగ్ ను పరిపాలన రాజధాని చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటిచ్చిన విషయం తెలిసిందే. ప్రకటన కూడా చేసేశారు. ఈ సమయంలో అమరావతి రాజధాని పేరుతో రైతులు చేస్తున్న పాదయాత్రను వైజాగ్ జిల్లా వాసులు స్వాగతిస్తారా? అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.

amaravathi farmers started maha padayatra for all regions support

amaravathi farmers started maha padayatra for all regions support

మరోవైపు అమరావతి రాజధాని పేరుతో పాదయాత్ర చేసేవాళ్లు ఎవరూ రైతులు కాదని, వాళ్లు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లు అని మరోవైపు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. వికేంద్రీకరణకు అనుకూలంగా ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా ప్రారంభించారు. మహా పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారు. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలను పెడుతున్నారు. మరోవైపు విశాఖ రాజధాని కోసం ఒక జేఏసీ కూడా ఏర్పాటు అయింది. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ఈ జేఏసీ పనిచేయనుంది. ఇదెలా ఉంటే.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీకే ఎక్కువ బలం ఉంది. టీడీపీ ప్రాబల్యం అక్కడ తగ్గింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల మహా పాదయాత్ర సక్సెస్ అవుతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది